ఆర్సీబీ విక్టరీ పరేడ్.. జనసంద్రమైన బెంగళూరు వీధులు.. చిన్నస్వామి దగ్గర పెను విషాదం-royal challengers bengaluru victory parade chinnaswamy stadium stampede 7 dead ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆర్సీబీ విక్టరీ పరేడ్.. జనసంద్రమైన బెంగళూరు వీధులు.. చిన్నస్వామి దగ్గర పెను విషాదం

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. జనసంద్రమైన బెంగళూరు వీధులు.. చిన్నస్వామి దగ్గర పెను విషాదం

Published Jun 04, 2025 06:09 PM IST Hari Prasad S
Published Jun 04, 2025 06:09 PM IST

ఐపీఎల్ 18 సీజన్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ బుధవారం (జూన్ 4) బెంగళూరులో విక్టరీ పరేడ్ తీసింది. వేల మంది రోడ్లపైకి రావడంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆర్సీబీ విక్టరీ పరేడ్ కోసం తరలి వచ్చిన వేల మంది అభిమానులు. వాళ్ల సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది.

(1 / 6)

ఆర్సీబీ విక్టరీ పరేడ్ కోసం తరలి వచ్చిన వేల మంది అభిమానులు. వాళ్ల సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది.

బెంగళూరులోని విధాన సభ దగ్గర ఆర్సీబీ టీమ్ అభిమానులు. ప్లేయర్స్ కు వాళ్లు ఘన స్వాగతం పలికారు.

(2 / 6)

బెంగళూరులోని విధాన సభ దగ్గర ఆర్సీబీ టీమ్ అభిమానులు. ప్లేయర్స్ కు వాళ్లు ఘన స్వాగతం పలికారు.

విధానసభ ముందు ఆర్సీబీ ప్లేయర్స్ భారీ స్టేజ్ మీద అభిమానులకు అభివాదం పలికారు.

(3 / 6)

విధానసభ ముందు ఆర్సీబీ ప్లేయర్స్ భారీ స్టేజ్ మీద అభిమానులకు అభివాదం పలికారు.

చిన్నస్వామి స్టేడియం దగ్గరికి కూడా వేల మంది అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

(4 / 6)

చిన్నస్వామి స్టేడియం దగ్గరికి కూడా వేల మంది అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

స్టేడియంలోకి వెళ్లడానికి కొందరు ఇలా తొక్కుకుంటూ మరీ ముందుకు వెళ్లడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

(5 / 6)

స్టేడియంలోకి వెళ్లడానికి కొందరు ఇలా తొక్కుకుంటూ మరీ ముందుకు వెళ్లడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

మంగళవారం (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై గెలిచిన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరులో ఆర్సీబీ టీమ్ విక్టరీ పరేడ్ నిర్వహించింది. అయితే ఆ ఆనందం ఈ పెను విషాదానికి దారితీసింది.

(6 / 6)

మంగళవారం (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై గెలిచిన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరులో ఆర్సీబీ టీమ్ విక్టరీ పరేడ్ నిర్వహించింది. అయితే ఆ ఆనందం ఈ పెను విషాదానికి దారితీసింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు