(1 / 5)
Rohit Sharma World Record: ఐసీసీ 50 ఓవర్ల ఫార్మాట్ టోర్నీల (వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ 64 సిక్స్ లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా రోహిత్ 65వ సిక్స్ తో అతన్ని వెనక్కి నెట్టాడు.
(PTI)(2 / 5)
Rohit Sharma World Record: అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత గేల్ (64 సిక్స్‌లు), మూడవ స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ (49 సిక్సర్లు, సెమీఫైనల్లో ఒక సిక్సర్ కొట్టాడు), డేవిడ్ మిల్లర్ 45 సిక్సర్లు. డేవిడ్ వార్నర్ 42 సిక్సర్లు. ఆ తరువాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (42 సిక్సర్లు) ఉన్నారు.
(PTI)(3 / 5)
Rohit Sharma World Record: రోహిత్, శుభ్‌మన్ కలిసి మరో రికార్డు క్రియేట్ చేశారు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీల్లో మూడో స్థానంలో నిలిచారు. వీళ్లు 33 ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకున్నారు.
(PTI)(4 / 5)
Rohit Sharma World Record: విరాట్ కోహ్లి కూడా సెమీఫైనల్ మ్యాచ్ లో ఓ రికార్డు అందుకున్నాడు. వన్డేల్లో చేజింగ్ లో 1000 రన్స్ చేసిన క్రికెటర్లు 237 మంది ఉన్నారు. కానీ కోహ్లి మాత్రమే 60కిపైగా సగటు సాధించడం విశేషం.
(AP)(5 / 5)
Rohit Sharma World Record: వన్డే క్రికెట్లో చేజింగ్ లో అత్యధిక రన్స్ చేసిన వారిలో సచిన్ తర్వాత విరాట్ ఉన్నాడు. తాజా మ్యాచ్ లో కోహ్లి చేజింగ్ లో రన్స్ 8 వేలు దాటాయి. సచిన్ 8720 రన్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్ 6115 రన్స్ ఉన్నాడు.
(PTI)ఇతర గ్యాలరీలు