Rohit sharma: సిక్సర్ల శర్మ.. ఛేజింగ్ లో మొనగాడు.. 32వ వన్డే సెంచరీతో రికార్డు.. హిట్ మ్యాన్ తాజా రికార్డులివే
Rohit sharma: ఇంగ్లండ్ తో రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇక్కడ చూసేయండి.
(1 / 6)
ఎంతో స్టైయిలిష్ గా రోహిత్ కొట్టే సిక్సర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రెండో స్థానం రోహిత్ దే. ప్రస్తుతం 338 సిక్సర్లతో ఉన్న హిట్ మ్యాన్.. క్రిస్ గేల్ (331)ను అధిగమించాడు. అగ్రస్థానంలో షాహిద్ అఫ్రిది (351) ఉన్నాడు.
(AP)(2 / 6)
రోహిత్ శర్మ తాజాగా 32వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన భారత బ్యాటర్లలో అతను మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి (50), సచిన్ తెందుల్కర్ (49) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
(HT_PRINT)(3 / 6)
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో రోహిత్ 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. వన్డేల్లో ఇది అతనికి సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 ప్రపంచకప్ లో అఫ్గానిస్థాన్ పై 63 బంతుల్లోనే హిట్ మ్యాన్ హండ్రెడ్ అందుకున్నాడు.
(AFP)(4 / 6)
వన్డేల్లో ఛేజింగ్ లోనూ రోహిత్ కు తిరుగులేదు. ప్రెషర్ ఎక్కువగా ఉండే పరిస్థితిలోనూ చెలరేగడం హిట్ మ్యాన్ కు అలవాటే. వన్డేల్లో 300 కు పైగా పరుగుల ఛేజింగ్ లో రోహిత్ 5 సెంచరీలతో జేసన్ రాయ్ తో కలిసి రెండోో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (9) అగ్రస్థానంలో ఉన్నాడు.
(AP)(5 / 6)
వన్డేల్లో ఛేజింగ్ లో రోహిత్ 6026 పరుగులు చేశాడు. సచిన్ తెందుల్కర్ (8720), కోహ్లి (7857) తర్వాత వన్డేల్లో ఛేజింగ్ లో హైయ్యస్ట్ స్కోరర్ రోహిత్. టోటల్ గా వన్డే ఛేజింగ్ లో రోహిత్ 16 సెంచరీలు చేశాడు.
(AFP)ఇతర గ్యాలరీలు