Rohit Sharma: రోహిత్ శర్మది చెత్త కెప్టెన్సీ.. నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావ్: కెప్టెన్‌పై మాజీ క్రికెటర్లు సీరియస్-rohit sharma captaincy pathetic say former cricketers sunil gavaskar ravi shastri msk prasad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rohit Sharma: రోహిత్ శర్మది చెత్త కెప్టెన్సీ.. నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావ్: కెప్టెన్‌పై మాజీ క్రికెటర్లు సీరియస్

Rohit Sharma: రోహిత్ శర్మది చెత్త కెప్టెన్సీ.. నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావ్: కెప్టెన్‌పై మాజీ క్రికెటర్లు సీరియస్

Dec 27, 2024, 01:59 PM IST Hari Prasad S
Dec 27, 2024, 01:59 PM , IST

  • Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్ లాంటి వాళ్లు తీవ్రంగా మండిపడ్డారు. అతనిది చెత్త కెప్టెన్సీ అని, స్పిన్నర్లపై నమ్మకం లేకపోతే ఇద్దరిని ఎందుకు తీసుకున్నావంటూ ప్రశ్నించారు.

Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి టీమిండియా పోరాడుతోంది. అయితే రెండో రోజు తొలి సెషన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, కొత్త బాల్ ను సరిగా వాడుకోవడంలో విఫలమవడంపై మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

(1 / 5)

(AFP)

Rohit Sharma: రెండో రోజు ఆస్ట్రేలియాను త్వరగా కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. స్మిత్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా ఏకంగా 474 రన్స్ చేసింది. కొత్త బంతితో ఆకాశ్ దీప్ పూర్తిగా విఫలమైనట్లు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. అసలు టీమ్ కు ఎలాంటి ప్లాన్ లేదని, ఫీల్డింగ్ కూడా చెత్తగా ఉందని అతనితోపాటు రవిశాస్త్రి కూడా అన్నాడు.

(2 / 5)

Rohit Sharma: రెండో రోజు ఉదయం కొత్త బంతితో ఆస్ట్రేలియాను దెబ్బతీసే అవకాశం ఉన్నా ఆకాశ్ దీప్ దానిని సద్వినియోగం చేసుకోలేదని గవాస్కర్ విమర్శించాడు. “మరీ చెత్త బౌలింగ్. బౌన్సర్ వేయాలంటే హెల్మెట్ స్థాయి వేయాలి కానీ నడుము ఎత్తులో కాదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఇలా అంటున్నందుకు సారీ. కొత్త బంతిని వృథా చేశారు. ఆకాశ్ దీప్ కొత్త బంతిని వృథా చేశాడు. కమిన్స్ కు సులువుగా రన్స్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులు వేశాడు. ఫీల్డింగ్ కూడా చెత్తగా ఉంది” అని కామెంటరీలో గవాస్కర్ అన్నాడు.

(3 / 5)

(REUTERS)

Rohit Sharma: అటు రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీపై మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా మండిపడ్డాడు. స్పిన్నర్లపై నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. “ఇండియా దగ్గర ప్లాన్స్ అయిపోయాయి. బౌలింగ్ మరీ దారుణంగా ఉంది. స్పిన్ బౌలింగ్ ను అవసరమైనంత వేయించలేదు. సుందర్ కు 40 ఓవర్ల తర్వాత బౌలింగ్ ఇచ్చారు. ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారు? వాళ్లపై మీకు నమ్మకం లేకపోతే వాళ్ల అవసరం ఏంటి” అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.

(4 / 5)

(PTI)

Rohit Sharma: మరో మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా రోహిత్ ను ఏకిపారేశాడు. “రోహిత్ శర్మ కెప్టెన్సీ చెత్తగా ఉంది. న్యూజిలాండ్ స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ ఓడిపోయాం. అది దారుణం. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అలాంటి కెప్టెన్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా మంచి కెప్టెన్సీ చూపించాడు. రోహిత్ తిరిగి రాగానే మళ్లీ అదే కథ. అతని ఫామ్ లేమి కెప్టెన్సీపైనా ప్రభావం చూపుతోంది. కెప్టెన్సీ నిర్ణయాలు సరిగా లేవు” అని ఎమ్మెస్కే తీవ్రంగా స్పందించాడు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు