Rohit record: కెప్టెన్ గా రోహిత్ ఫిఫ్టీ.. అగ్రస్థానంలో ధోని.. ఎలీట్ లిస్ట్ లో కోహ్లి కూడా
Rohit record: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 50 వన్డేల్లో సారథిగా జట్టును నడిపించిన 8వ భారత కెప్టెన్ గా నిలిచాడు. ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ కంటే కోహ్లి ముందున్నాడు.
(1 / 5)
కటక్ లో fఆదివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డే కెప్టెన్ గా రోహిత్ కు 50వ మ్యాచ్. సారథిగా అతను వన్డేల్లో ఫిఫ్టీని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత 8వ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు.
(AP)(2 / 5)
రోహిత్ కెప్టెన్సీలో భారత్ 50వ వన్డే ఆడుతోంది. అతని సారథ్యంలో 49 వన్డేల్లో టీమ్ఇండియా 35 మ్యాచ్ లు గెలిచింది. కెప్టెన్ గా వన్డేల్లో రోహిత్ విన్ పర్సెంటేజీ 70 గా ఉంది. కనీసం 10 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లలో రోహిత్ దే అత్యుత్తమ పర్సంటేజీ.
(REUTERS)(3 / 5)
అత్యధిక వన్డేల్లో భారత జట్టును నడిపించిన రికార్డు మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోని పేరు మీద ఉంది. అగ్రస్థానంలో ఉన్న మహి 200 వన్డేల్లో టీమ్ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.
(@WorshipDhoni)(4 / 5)
రోహిత్ కంటే ముందు టీమ్ఇండియా కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లి 95 వన్డేల్లో జట్టును నడిపించాడు. అత్యధిక వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోని (200), అజహరుద్దీన్ (174), సౌరభ్ గంగూలీ (146) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు