(1 / 6)
పులన్ విశారణై, కెప్టెన్ ప్రభాకరన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సెల్వమణి నటి రోజాను వివాహం చేసుకున్నాడు. అయితే, ప్రేమించి పెద్దలను ఒప్పించిన వీరి ప్రేమకథ అంత ఈజీగా సాగలేదు. మరి రోజా కోసం సెల్వమణి తీసుకున్న ఛాలెంజ్‌లు రిస్క్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
(2 / 6)
'ఐ లవ్ యూ' చెప్పడానికి ముందే దర్శకుడు సెల్వమణి రోజాను ఆమె ఇంట్లో కలుసుకుని తమ కుటుంబంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. అయితే సెల్వమణి, రోజాలు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో తమ లవ్ స్టోరీ దెబ్బతింటుందని మొదట్లో భావించారు.
(3 / 6)
ప్రేమలో నెగ్గాలంటే ముందుగా తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు సెల్వమణి. దాంతో రోజా తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. అయితే, అదివరకే రోజా ఇంట్లో సెల్వమణి మంచి ప్రవర్తన కనబర్చాడు. మంచి వ్యక్తిగా నడుచుకున్న సెల్వమణికి రోజాను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ తర్వాతే రోజా దగ్గరికి వెళ్లి సెల్వమణి ఐ లవ్యూ అని ప్రపోజ్ చేశారట.
(4 / 6)
సీనియర్ హీరోయిన్ రోజా బర్త్ డే సందర్భంగా సెల్వమణి ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అప్పట్లో అగ్ర నటిగా ఉన్న రోజా అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
(5 / 6)
తన ప్రేమను అంగీకరించిన తర్వాత కూడా దర్శకుడు సెల్వమణి నటి రోజాతో 'మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. మీకు ఎప్పటివరకు నటించాలని ఉంటే అప్పటివరకు నటిస్తూనే ఉండండి. దానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను' అంటూ తనకు కాబోయే భాగస్వామి కోరికను గౌరవిస్తూ సెల్వమణి చెప్పినట్లు రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
(6 / 6)
సెల్వమణి మొదట రోజా తల్లిదండ్రులను తన ప్రేమ గురించి చెప్పి ఒప్పించాడు. కానీ, అతను దాదాపుగా పదేళ్లు వేచి చూశాడు. అవును, రోజా, సెల్వమణి ప్రేమించుకున్న 10 సంవత్సరాల తరువాత వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. రోజాస సెల్వమణిలకు అనుష్మాలిక సెల్వమణి, కృష్ణ లోహిత్ సెల్వమణి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇతర గ్యాలరీలు