Rishabh Pant - Dhoni: ధోనీని సమం చేసిన పంత్.. శకతంతో రప్ఫాడించిన రిషబ్
- Rishabh Pant - MS Dhoni: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో శతకంతో చెలరేగాడు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు.
- Rishabh Pant - MS Dhoni: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో శతకంతో చెలరేగాడు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు.
(1 / 5)
సుమారు 21 నెలల బ్రేక్ తర్వాత టెస్టు క్రికెట్‍లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో జరుగుతున్న తొలి టెస్టులో నేడు (సెప్టెంబర్ 21) శకతంతో విజృంభించాడు. (PTI)
(2 / 5)
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి శకతంతో అదరగొట్టాడు. 13 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు. టెస్టుల్లో తన ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. (PTI)
(3 / 5)
భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ ఇప్పుడు సమం చేశాడు. 90 టెస్టుల్లో ధోనీ ఆరు టెస్టు సెంచరీలు చేస్తే.. పంత్ 34వ మ్యాచ్‍లోనే ఆరో శకతం నమోదు చేశాడు. మరో టెస్టు సెంచరీ చేస్తే ఈ రికార్డులో ధోనీని రిషబ్ దాటేస్తాడు. (PTI)
(4 / 5)
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‍తో మైదానంలోకి వచ్చాడు. జూలైలో శ్రీలంకతో టీ20 సిరీస్‍తో టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బంగ్లాతో సిరీస్‍తో 21 నెలల తర్వాత టెస్టు క్రికెట్‍లో బరిలోకి దిగాడు. రీ-ఎంట్రీ టెస్టులోనే శకతంతో దుమ్మురేపాడు. (PTI)
ఇతర గ్యాలరీలు