(1 / 5)
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదాడు. దీంతో ఇంగ్లండ్ లో ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
(AP)(2 / 5)
జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ తర్వాత ఒక టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గానూ పంత్ రికార్డు క్రియేట్ చేశాడు.
(AFP)(3 / 5)
ఇంగ్లండ్ లో రిషబ్ పంత్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత రాహుల్ ద్రవిడ్ (6) పేరిట ఉంది.
(AFP)(4 / 5)
కేఎల్ రాహుల్ తో కలిసి రిషబ్ పంత్ టీమిండియాను తొలి టెస్టులో విజయం దిశగా నడిపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయమో లేదంటే డ్రా కావడమో తప్ప ఓడిపోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో 134 రన్స్ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేశాడు. రాహుల్ తో కలిసి 4వ వికెట్ కు 195 రన్స్ జోడించడం విశేషం.
(AFP)(5 / 5)
కేఎల్ రాహుల్ కూడా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు. అతడు 18 నెలల తర్వాత మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం.
(AP)ఇతర గ్యాలరీలు