Rich Directors: ఈ డైరెక్టర్స్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత ధనిక దర్శకుడు ఎవరంటే?-richest directors in bollywood karan johar to rajkumar hirani net worth and highest earning bollywood directors ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rich Directors: ఈ డైరెక్టర్స్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత ధనిక దర్శకుడు ఎవరంటే?

Rich Directors: ఈ డైరెక్టర్స్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత ధనిక దర్శకుడు ఎవరంటే?

Dec 26, 2024, 02:46 PM IST Sanjiv Kumar
Dec 26, 2024, 02:46 PM , IST

Richest Bollywood Directors And Net Worth In Telugu: హీరో హీరోయిన్ల సంపాదన కోట్లల్లో ఉంటుందని తెలిసిందే. అందుకే వారి ఆస్తులు కూడా భారీగా ఉంటాయి. మరి అదే స్థాయిలో డైరెక్టర్స్ ఆస్తులు కూడా ఉంటాయని ఈ హిందీ దర్శకుల నెట్ వర్త్ చూస్తే తెలుస్తుంది. మరి ఏ డైరెక్టర్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో చూద్దాం.

బాలీవుడ్ నుంచి వచ్చే గొప్ప సినిమాలను వెనుకుండి నడిపించేది డైరెక్టర్సే. ఒక సినిమా మంచి సక్సెస్ కావడానికి దర్శకుల కృషి ఎంతగానో ఉంటుంది. మరి అలాంటి బాలీవుడ్ డైరెక్టర్స్‌లో అత్యంత ధనిక దర్శకులు ఎవరు? వారి వద్ద ఎంత సంపాదన ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 9)

(instagram)

కరణ్ జోహార్ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుల్లో ఒకరు. కరణ్ తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా వార్తల్లో ఉంటాడు. కరణ్ మొత్తం సంపద సుమారుగా రూ.1700 కోట్లు ఉంటుందని సమాచారం.

(2 / 9)

'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్' వంటి ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ వద్ద రూ. 1,300 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 

(3 / 9)

బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ మొత్తం ఆస్తుల విలువ రూ.940 కోట్లు అని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అలాగే, సంజయ్ లీలా భన్సాలీకి సినిమాల ద్వారా వచ్చిన సంపాదన కాకుండా పలు అసెట్స్ కూడా ఉన్నాయని సమాచారం. 

(4 / 9)

ఎక్కువగా రియల్ అండ్ బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కించే నటుడు, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆస్తుల విలువ రూ.850 కోట్లు అని సమాచారం. కాగా ఇటీవలే అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వివాహం ఘనంగా జరిగింది. 

(5 / 9)

అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్. బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్, టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరైన మేఘనా నికర ఆస్తుల విలువ రూ. 830 కోట్లు అని టాక్.

(6 / 9)

సల్మాన్ ఖాన్‌తో 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయిజాన్' వంటి చిత్రాలను రూపొందించిన కబీర్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ రూ.400 కోట్లు అని బాలీవుడ్ టాక్.

(7 / 9)

ఎక్కువగా యాక్షన్ సినిమాలను తెరకెక్కించే రోహిత్ శెట్టి ఆస్తుల విలువ పలు నివేదికల ప్రకారం రూ. 336 కోట్లు అని సమాచారం. 

(8 / 9)

'బర్ఫీ' వంటి సినిమాలు తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసు మొత్తం సంపాదన రూ. 330 కోట్లు అని సమాచారం. అయితే, ఈ లెక్కల ప్రకారం అత్యంత ధనిక బాలీవుడ్ డైరెక్టర్‌గా 1700 కోట్లతో కరణ్ జోహార్ నిలిచాడని తెలుస్తోంది. అలాగే, అతి తక్కువ స్థానంలో అనురాగ్ బసు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు