Triumph Scrambler 400 X: మార్కెట్లోకి లేటెస్ట్ గా దూసుకువస్తున్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బీ రెడీ..-review in pics triumph scrambler 400 x is all set to disrupt the market ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Triumph Scrambler 400 X: మార్కెట్లోకి లేటెస్ట్ గా దూసుకువస్తున్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బీ రెడీ..

Triumph Scrambler 400 X: మార్కెట్లోకి లేటెస్ట్ గా దూసుకువస్తున్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బీ రెడీ..

Oct 18, 2023, 01:21 PM IST HT Telugu Desk
Oct 18, 2023, 01:21 PM , IST

  • Triumph Scrambler 400 X: ట్రయంఫ్, బజాజ్ ఆటో భాగస్వామ్యంలో రూపొందుతున్న 400 సీసీ సెగ్మెంట్ బైక్స్ లోకి మరో ట్రెండీ మోడల్ చేరింది. అదే.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్. ఈ బైక్ ఫీచర్స్, రివ్యూ ని ఇక్కడ చూసేయండి..

ఐదేళ్ల క్రితం ట్రయంఫ్, బజాజ్ ల భాగస్వామ్యం ప్రారంభమైంది. ఆ పార్ట్ నర్ షిప్ తో వచ్చిన తొలి మోటార్‌సైకిల్ స్పీడ్ 400, దీనికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు లేటెస్ట్ గా స్క్రాంబ్లర్ 400 X వస్తోంది.

(1 / 8)

ట్రయంఫ్ స్పీడ్ 400 తో పోలిస్తే.. స్క్రాంబ్లర్ 400 X లో డిజైన్ లోనే కాకుండా మెకానికల్ మార్పులు కూడా చేశారు. ఈ బైక్ పెద్ద ఫ్రంట్ వీల్, నకల్ గార్డ్‌లు, హెడ్‌లైట్ గ్రిల్, బాష్ ప్లేట్, స్ప్లిట్ సీట్ సెటప్ మరియు స్ప్లిట్ గ్రాబ్ రైల్‌తో వస్తుంది. పక్కన కొత్త ఎగ్జాస్ట్ యూనిట్ కూడా ఉంది. ఇది డ్యూయల్-బ్యారెల్ యూనిట్. ఇది స్పీడ్ 400లో కనిపించే ఎగ్జాస్ట్ కంటే మెరుగైన సౌడ్ ఔట్ పుట్ ను ఇస్తుంది.

(2 / 8)

స్క్రాంబ్లర్ 400 X లో  320 ఎంఎం డిస్క్ బ్రేక్‌ తో 19-అంగుళాల ఫ్రంట్ వీల్ ఉంటుంది. స్పీడ్ 400లో ఉన్న బ్రేక్ ప్యాడ్‌లను ట్రయంఫ్ లో ఉపయోగించలేదు. కానీ, రఫ్ రైడ్స్ లో ప్రయాణించేటప్పుడు సహాయపడే మరింత ప్రోగ్రెస్సివ్ బైట్‌ ఇందులో ఉంది.

(3 / 8)

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక డిజి-అనలాగ్ యూనిట్. స్పీడోమీటర్ ఎడమ వైపున అనలాగ్ రూపంలో చూపబడింది, అయితే డిజిటల్ యూనిట్‌లో టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గాగ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్, పెట్రోల్ క్వాంటిటీ, మైలేజీ, క్లాక్.. మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. 

(4 / 8)

ట్రయంఫ్ లో రైడ్-బై-వైర్ సిస్టమ్‌ ఉంది, కానీ, వేర్వేరు రైడింగ్ మోడ్స్ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ కానీ లేవు. ఈ బైక్ పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్‌తో వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్‌ సదుపాయం ఉంది. మొబైల్ ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

(5 / 8)

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X లో వెడల్పుగా, పొడవుగా ఉండే కొత్త హ్యాండిల్‌బార్‌ ను అమర్చారు. ఫుట్ పెగ్‌లు ఇప్పుడు కొంచెం ముందుకు మార్చారు. స్పీడ్ 400తో పోలిస్తే రైడింగ్ ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా, రిలాక్స్‌డ్ గా మారింది.

(6 / 8)

స్క్రాంబ్లర్ 400 Xలోని ఇంజన్ స్పీడ్ 400 మాదిరిగానే ఉంటుంది. ఇది లిక్విడ్-కూల్డ్ 398.15 సీసీ, సింగిల్-సిలిండర్ యూనిట్. ఇది 39.5 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37.5 ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వేగాన్ని తగ్గించడంలో సహాయపడటానికి ఎక్కువ ఇంజన్ బ్రేకింగ్ ఉండేలా ఈ బైక్ లో ఇంజన్‌ని ట్రయంఫ్ రీట్యూన్ చేసింది. స్క్రాంబ్లర్ 400 Xలో  6-స్పీడ్ యూనిట్ గేర్‌బాక్స్ ఉంటుంది.

(7 / 8)

ఈ బైక్ ను నడిపే సమయంలో రైడర్ గేర్స్ ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం లేదు. తక్కువ వేగం నుంచి గేర్ మార్చాల్సిన అవసరం లేకుండానే సునాయాసంగా ఎక్కువ వేగంలోకి తొందరగా వెళ్లగలదు. అయితే, 5,000 ఆర్పీఎం తర్వాత, హ్యాండిల్‌బార్ పై, ఫుట్ పెగ్‌లపై  వైబ్రేషన్‌లు రావడం ప్రారంభమవుతాయి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు