(1 / 5)
రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ తో జస్ప్రీత్ బుమ్రా ఈ ఫార్మాట్లో కెప్టెన్ అవుతాడనే అంచనాలు భారీగానే నెలకొన్నాయి. బుమ్రాకే పగ్గాలు ఇస్తారని అంతా అనుకున్నారు.
(x/Jaspritbumrah93)(2 / 5)
టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానాన్ని బుమ్రా భర్తీ చేస్తాడనుకుంటే షాకింగ్ విషయం తెలిసింది. భారత టెస్టు కెప్టెన్ గా యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతందనే వార్తలు వస్తున్నాయి.
(x/Jaspritbumrah93)(3 / 5)
బుమ్రానె టెస్టు కెప్టెన్సీ వద్దన్నాడనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పనిభారం నిర్వహణ కారణంగా కెప్టెన్సీ వద్దని సెలక్టర్లకు బుమ్రా చెప్పాడని స్కై స్పోర్ట్స్ వెల్లడించింది.
(x/Jaspritbumrah93)(4 / 5)
గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టులో రోహిత్ లేకపోతే బుమ్రానే టీమిండియాను నడిపించాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది. చివరి టెస్టులోనూ బుమ్రానే కెప్టెన్. అంతకుముందు ఇంగ్లాండ్ తో ఓ టెస్టుకు సారథిగా వ్యవహరించాడు. కానీ గాయాలు బుమ్రాను దెబ్బకొడుతున్నాయి. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో దాదాపు మూడు నెలల బుమ్రా ఆటకు దూరమయ్యాడు.
(x/Jaspritbumrah93)(5 / 5)
టెస్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఎంపికకు రంగం సిద్ధమైందని తెలిసింది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు టెస్టు టీమ్ ను ప్రకటించే సమయంలోనే గిల్ ను కెప్టెన్ గా బీసీసీఐ అనౌన్స్ చేయబోతోంది. ఈ నెల 20 తర్వాత ఇది జరిగే అవకాశముంది.
(x/bcci)ఇతర గ్యాలరీలు