తెలుగు న్యూస్ / ఫోటో /
Repalle Railway Station : రేపల్లె రైల్వే స్టేషన్ ముఖచిత్రం చూశారా..! మారిపోనున్న రూపురేఖలు, ఈ ఫొటోలు చూడండి
- SCR Railway Stations Redeveloped : ఏపీ, తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి.“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” రైల్వే శాఖ… ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రేపల్లెతో పాటు హైదరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

(1 / 6)
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న రేపల్లె రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
(2 / 6)
మొత్తం 25.5 కోట్ల రూపాయాలతో రేపల్లె రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.
(3 / 6)
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రేపల్లె రైల్వే స్టేషన్ ను ఆధునాతన స్టేషన్ గా మార్చబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
(4 / 6)
మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా పూర్తిగా మార్చేయనున్నారు. మొత్తం రూ. 309కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
(5 / 6)
హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు సంబంధించి రైల్వే శాఖ రూపొందించిన డిజైన్లను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. మెయిన్ స్టేషన్, పార్కింగ్, వాహనాలు వెళ్లే దారితో పాటు మరికొన్ని మార్కింగ్స్ తో ఈ డిజైన్లను విడుదల చేశారు.
ఇతర గ్యాలరీలు