రోజుకోసారి ముక్కులో రెండు చుక్కల నెయ్యి వేసుకుంటే జరిగే అద్భుతాలేంటో తెలుసా?-releiving from stress hair loss and more health benefits of putting ghee in nose before sleeping ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రోజుకోసారి ముక్కులో రెండు చుక్కల నెయ్యి వేసుకుంటే జరిగే అద్భుతాలేంటో తెలుసా?

రోజుకోసారి ముక్కులో రెండు చుక్కల నెయ్యి వేసుకుంటే జరిగే అద్భుతాలేంటో తెలుసా?

Published Apr 29, 2025 08:15 AM IST Ramya Sri Marka
Published Apr 29, 2025 08:15 AM IST

  • నెయ్యి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మనందరికీ తెలుసు. కానీ దీన్ని ముక్కులో వేసుకోవడం వల్ల కూడా చాలా లాభాలున్నాయని మీలో ఎవరికైనా తెలుసా? అవును.. ప్రతిరోజూ పడుకునే ముందు 2 చుక్కల నెయ్యిని మీ ముక్కులో వేసుకోవడం వల్ల అద్భతుమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

భారతీయ వంటకాల్లో నెయ్యి చాలా రకాలుగా ఉపయోగించబడుతుంది. నెయ్యిని తినడం వల్ల ఆహారానికి రుచి మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.చాలా మంది తెలియని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నెయ్యిని ముక్కులో వేసుకోవడం వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు. అవేంటో నెయ్యిని ముక్కులో ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రండి.

(1 / 8)

 మానసిక ఒత్తిడి చాలా మందికి తలనొప్పిని కలిగిస్తుంది. అదేవిధంగా కొంతమందికి మైగ్రేన్ సమస్య కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో, మీరు ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యిని మీ ముక్కులో వేసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు

(2 / 8)

కొంతమందికి ఎంత ప్రయత్నించినా రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇటువంటి పరిస్థితుల్లో, రాత్రి పడుకునే ముందు మీ ముక్కులో నెయ్యిని రాయడం నిద్రలేమి సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది మీకు గాఢమైన నిద్రకు సహాయపడుతుంది.

(3 / 8)

ముక్కులో రెండు చుక్కల దేశీ నెయ్యిని ఉపయోగించడం మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి మెదడులోని నరాలను ప్రేరేపిస్తుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెదడులోని నరాలకు కూడా పోషణను అందిస్తుంది.

(4 / 8)

ముక్కులో రెండు చుక్కల వేడి నెయ్యిని ఉపయోగించడం ద్వారా జలుబు,  ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ముక్కులో పొడిబారడం, దురద, ఇన్ఫెక్షన్  వంటి సమస్యలను నయం చేయడంలో కూడా నెయ్యి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ముక్కులో దుమ్ము కారణంగా మీరు తరచుగా తుమ్ముతుంటే, ఈ ట్రిక్ మీ చాలా హెల్ప్ చేస్తుంది.

(5 / 8)

ముక్కులో రెండు చుక్కల నెయ్యిని వేయడం మీ జుట్టును బలపరుస్తుంది. ఇది జుట్టు రాలడం, పొడిగా మారడం, వంటి సమస్యలకు ఉత్తమ పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు.

(6 / 8)

ముక్కులో రెండు చుక్కల నెయ్యిని రాయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎల్లప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడేవారు ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా పడుకునే ముందు ముక్కులో రెండు చుక్కల నూనెను వేసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.

(7 / 8)

రోజూ రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే రెండు చుక్కల నెయ్యిని వేసుకున్నారంటే అన్ని రకాల ప్రయోజనాలను పొందచ్చు. స్వచ్ఛమైన దేశీ నెయ్యి అయితే మంచిది.

(8 / 8)

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు