Refined Oils: రిఫైండ్ ఆయిల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనే ప్రచారంలో నిజం ఎంత? ఏ నూనెలు సురక్షితం..
- Refined Oils: రిఫైండ్ ఆయిల్స్ వినియోగంపై రకరకాల వాదనలు ఉన్నాయి. రిఫైండ్ చేయని నూనెల వినియోగంతో చేటు కలుగుతుందని కొందరు, అతిగా రిఫైన్ చేసిన నూనెలతో నష్టమని మరికొందరు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా చేయడంలో రిఫైండ్ ఆయిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు ప్రబలంగా ఉన్నాయి.
- Refined Oils: రిఫైండ్ ఆయిల్స్ వినియోగంపై రకరకాల వాదనలు ఉన్నాయి. రిఫైండ్ చేయని నూనెల వినియోగంతో చేటు కలుగుతుందని కొందరు, అతిగా రిఫైన్ చేసిన నూనెలతో నష్టమని మరికొందరు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా చేయడంలో రిఫైండ్ ఆయిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు ప్రబలంగా ఉన్నాయి.
(1 / 6)
రిఫైండ్ ఆయిల్స్ వినియోగంపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అతిగా రిఫైండ్ చేసిన వంట నూనెలతో గుండె జబ్బులు సంక్రమిస్తున్నట్టు ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో కణాలు సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన పోషకాలను వంట నూనెలల నుంచి శరీరం శోషణం చేసుకోవాల్సి ఉంటుంది.
(Adani Wilmar website)(2 / 6)
శరీరంలో కణాలు సరిగా పనిచేయడానికి, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడానికి, అదనంగా ఉన్న కల్మషాలను తొలగించడానికి కణాల చుట్టూ ఉండే పొరల రక్షణకు కొవ్వు పదార్ధాల అవసరం ఉంది.
(freepik)(3 / 6)
ఒమెగా 6, ఒమెగా 3 అని పిలిచే ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు 3:1 నిష్పత్తిలో ఉన్నపుడు ఆరోగ్యంగా ఉంటాము. రిఫైండ్ ఆయిల్స్‌లో ఒమెగా 3 కంటే ఒమెగా 6 అధికంగా ఉంటుంది. రిఫైండ్ చేసిన వేరుశనగ, సన్ ఫ్లవర్ నూనెల్లో శరీరానికి హాని చేసే గుణాలు ఉంటాయి.
(HT_PRINT)(4 / 6)
గింజల నుంచి నూనెలను ఉత్తత్తి చేసే క్రమంలో వినియోగిస్తున్న హెక్సెన్‌లు కాళ్లు, చేతుల్లో ఉండే నరాలకు హాని కలిగిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తికి అధిక ఉష్ణోగ్రతకు గురి చేయడం వల్ల అవి ట్రాన్స్‌ఫ్యాట్స్‌గా మారుతున్నాయి. ఇది కణాల వాపుకు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి గుండె జబ్బులకు కారణం అవుతోంది.
(5 / 6)
హానికరమైన రిఫైండ్ ఆయిల్స్ స్థానంలో గానుగ నూనెల వినియోగాన్ని సిఫార్సు చేస్తున్నారు. అయితే వీటిలో మలినాలు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. వంటలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు సురక్షితంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకు గురి కాకుండా ఉండాలంటేూ వంటల్లో ఒమెగా 3, 6,9 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే నూనెల వినియోగం మేలు చేస్తుంది.
(HT Photo)ఇతర గ్యాలరీలు