AirPods Trick: మీరు ఐఫోన్ వాడుతున్నారా! ఎయిర్‌పోడ్స్‌తో బయటి శబ్దాలను అడ్డుకోండిలా..-reduce exposure to loud noise while using airpods with this trick for iphone users ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Reduce Exposure To Loud Noise While Using Airpods With This Trick For Iphone Users

AirPods Trick: మీరు ఐఫోన్ వాడుతున్నారా! ఎయిర్‌పోడ్స్‌తో బయటి శబ్దాలను అడ్డుకోండిలా..

Mar 04, 2023, 12:55 PM IST Chatakonda Krishna Prakash
Mar 04, 2023, 12:55 PM , IST

AirPods: ఇయర్‌బడ్స్‌లో నచ్చిన పాటలు వింటున్నప్పుడు బయటికి నుంచి ఏవైనా శబ్దాలు వినిపిస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మీరు ఐఫోన్ యూజర్ అయితే మీ దగ్గరి ఎయిర్‌పోడ్స్‌ ఉంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఎయిర్‌పోడ్స్‌లో ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని బయటి నుంచి వచ్చే శబ్దాలు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా అడ్డుకోవచ్చు.

ఇష్టమైన పాటలు లేదా పోడ్‍కాస్ట్ వింటున్నప్పుడు బయటి శబ్దాలు ఇబ్బంది కలిగించడాన్ని ఎవరూ ఇష్టపడరు. అయితే మీరు ఐఫోన్ యూజర్ అయి ఉండి.. మీ దగ్గర ఎయిర్‌పోడ్స్‌ లేదా ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్ హెడ్‍ఫోన్స్ ఉంటే మీరు బయటి శబ్దాలను మీ వరకు రాకుండా అడ్డుకోవచ్చు. మీ చుట్టుపక్కల శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా చేసుకోవచ్చు. 

(1 / 6)

ఇష్టమైన పాటలు లేదా పోడ్‍కాస్ట్ వింటున్నప్పుడు బయటి శబ్దాలు ఇబ్బంది కలిగించడాన్ని ఎవరూ ఇష్టపడరు. అయితే మీరు ఐఫోన్ యూజర్ అయి ఉండి.. మీ దగ్గర ఎయిర్‌పోడ్స్‌ లేదా ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్ హెడ్‍ఫోన్స్ ఉంటే మీరు బయటి శబ్దాలను మీ వరకు రాకుండా అడ్డుకోవచ్చు. మీ చుట్టుపక్కల శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా చేసుకోవచ్చు. (Pexels)

ఎయిర్‌పోడ్స్‌లో రెండు మోడ్‍లు ఉంటాయి. అందులో ఒకటి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ముఖ్యమైనది. ఈ మోడ్ ఆన్ చేసుకుంటే చుట్టుపక్కల శబ్దాలు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయలేవు. నాయిస్‍ను ఈ మోడ్ అడ్డుకొని ఆ శబ్దాలు మీ చెవి వరకు రాకుండా చేస్తుంది. దీంతో మీ చుట్టుపక్కల శబ్దాలు ఉన్నా మీరు ప్రశాంతంగా పాటలు వినవచ్చు. ఇక ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్. ఒకవేళ మీరు చుక్కపక్కల శబ్దాలను కూడా వినాలనుకుంటే ఈ మోడ్‍ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 

(2 / 6)

ఎయిర్‌పోడ్స్‌లో రెండు మోడ్‍లు ఉంటాయి. అందులో ఒకటి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ముఖ్యమైనది. ఈ మోడ్ ఆన్ చేసుకుంటే చుట్టుపక్కల శబ్దాలు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయలేవు. నాయిస్‍ను ఈ మోడ్ అడ్డుకొని ఆ శబ్దాలు మీ చెవి వరకు రాకుండా చేస్తుంది. దీంతో మీ చుట్టుపక్కల శబ్దాలు ఉన్నా మీరు ప్రశాంతంగా పాటలు వినవచ్చు. ఇక ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్. ఒకవేళ మీరు చుక్కపక్కల శబ్దాలను కూడా వినాలనుకుంటే ఈ మోడ్‍ను యాక్టివేట్ చేసుకోవచ్చు. (Unsplash)

ఎయిర్‌పోడ్స్‌ను ఐఫోన్‍కు కనెక్ట్ చేసినప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్‍ను ఆన్ చేసుకోవచ్చు. ఐఫోన్‍లో సెట్టింగ్స్‌ (Settings)లో యాక్ససబులిటీ (Accessibility) > ఆడియో / విజువల్ (Audio/Visual) > హెడ్‍ఫోన్ అకామిడేషన్స్ (Headphone Accommodations) ఆప్షన్‍లోకి వెళ్లాలి. అక్కడ హెడ్‍ఫోన్ అకామిడేషన్స్ ఆన్ చేసుకోవాలి. అనంతరం యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ల మీ మధ్య ఎయిర్‌పోడ్స్‌ను స్విచ్ చేసుకోవచ్చు. 

(3 / 6)

ఎయిర్‌పోడ్స్‌ను ఐఫోన్‍కు కనెక్ట్ చేసినప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్‍ను ఆన్ చేసుకోవచ్చు. ఐఫోన్‍లో సెట్టింగ్స్‌ (Settings)లో యాక్ససబులిటీ (Accessibility) > ఆడియో / విజువల్ (Audio/Visual) > హెడ్‍ఫోన్ అకామిడేషన్స్ (Headphone Accommodations) ఆప్షన్‍లోకి వెళ్లాలి. అక్కడ హెడ్‍ఫోన్ అకామిడేషన్స్ ఆన్ చేసుకోవాలి. అనంతరం యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ల మీ మధ్య ఎయిర్‌పోడ్స్‌ను స్విచ్ చేసుకోవచ్చు. (Pexels)

ఐఫోన్‍ను ఉపయోగించి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ ఆన్ చేసుకోవాలంటే.. నాయిస్ కంట్రోల్ ఆప్షన్‍లోకి వెళ్లి.. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్‍ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్ కోసం కస్టమ్ ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ను ఆన్ చేసుకోవాలి.

(4 / 6)

ఐఫోన్‍ను ఉపయోగించి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ ఆన్ చేసుకోవాలంటే.. నాయిస్ కంట్రోల్ ఆప్షన్‍లోకి వెళ్లి.. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్‍ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్ కోసం కస్టమ్ ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ను ఆన్ చేసుకోవాలి.(Pexels)

ఐఫోన్ నుంచి కాకుండా ఎయిర్‌పోడ్స్‌ నుంచి కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ల మధ్య స్విచ్ కావొచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోడ్స్‌ సైడ్‍లో ఉండే ఫోర్స్ సెన్సార్ (force sensor)ను ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా చేస్తే రెండు మోడ్‍ల మధ్య స్విచ్ కావొచ్చు. ఐఫోన్‍లోని బ్లూటూత్ సెట్టింగ్స్ ద్వారా ఈ స్విచ్ సెట్టింగ్‍లను మార్చుకోవచ్చు. 

(5 / 6)

ఐఫోన్ నుంచి కాకుండా ఎయిర్‌పోడ్స్‌ నుంచి కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్‍ల మధ్య స్విచ్ కావొచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోడ్స్‌ సైడ్‍లో ఉండే ఫోర్స్ సెన్సార్ (force sensor)ను ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా చేస్తే రెండు మోడ్‍ల మధ్య స్విచ్ కావొచ్చు. ఐఫోన్‍లోని బ్లూటూత్ సెట్టింగ్స్ ద్వారా ఈ స్విచ్ సెట్టింగ్‍లను మార్చుకోవచ్చు. (Pexels)

యాపిల్ వాచ్ ద్వారా కూడా ఎయిర్‌పోడ్స్‌ మోడ్‍లను చేంజ్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్‍లోని ఎయిర్ ప్లే ఐకాన్‍పై క్లిక్ చేసి.. నాయిస్ క్యాన్సలేషన్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి. ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్ కూడా అక్కడే కనిపిస్తుంది. 

(6 / 6)

యాపిల్ వాచ్ ద్వారా కూడా ఎయిర్‌పోడ్స్‌ మోడ్‍లను చేంజ్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్‍లోని ఎయిర్ ప్లే ఐకాన్‍పై క్లిక్ చేసి.. నాయిస్ క్యాన్సలేషన్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి. ట్రాన్స్‌ప్రెన్సీ మోడ్ కూడా అక్కడే కనిపిస్తుంది. (Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు