Hitech City Railway Station : హైటెక్ హంగులతో 'హైటెక్ సిటీ రైల్వే స్టేషన్' అభివృద్ధి పనులు...! ఈ ఫొటోలు చూడండి
- Hitech City Railway Station Redevelopment : అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 72 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
- Hitech City Railway Station Redevelopment : అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 72 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
(1 / 6)
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి.
(2 / 6)
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. గతేడాదే ప్రతిపాదిత నమూనాను కూడా రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
(image source Railway - ప్రతిపాదిత డిజైన్)(3 / 6)
ఈ స్కీమ్ లో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా రైల్వేశాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు ప్రగతికి సంబంధించి రైల్వేశాఖ తాజాగా ముఖ్యమైన వివరాలను పేర్కొంది.
(4 / 6)
కేంద్ర రైల్వేశాఖ తెలిపిన వివరాల ప్రకారం…. ఇప్పటివరకు 72 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన ఎంట్రీ ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్ పనులు వందశాతం పూర్తయ్యాయి.
(5 / 6)
స్టేషన్ బిల్డింగ్, సర్యులేటింగ్ ఏరియా, లిఫ్ట్, ఎస్కులేటర్, ఫ్లాట్ ఫామ్ ఫేసింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది.
(6 / 6)
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను రూ.26.6 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. హైటెక్ హంగులతో ఈ రైల్వే స్టేషన్‍ను అభివృద్ధి చేస్తున్నారు.
ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్ లోని కాజీపేట్ రైల్వే జంక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఇతర గ్యాలరీలు