తెలుగు న్యూస్ / ఫోటో /
Realme GT 7 Pro: రియల్‍మీ నుంచి త్వరలో నయా పవర్‌ఫుల్ మొబైల్: స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..
Realme GT 7 Pro: రియల్‍మీ నుంచి త్వరలో ఫ్లాగ్‍షిప్ రేంజ్ మొబైల్ లాంచ్ కానుంది. రియల్‍మీ జీటీ 7 ప్రో పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల వివరాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
రియల్‍మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ నవంబర్ 4వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. త్వరలోనే ఈ ఫ్లాగ్‍షిప్ ఫోన్ ఇండియా మార్కెట్‍లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మొబైల్‍ను రియల్‍మీ టీజ్ చేస్తోంది. ఏఐ ఫీచర్లతో ఈ మోడల్ రానుంది. ఇప్పటికే చాలా స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. (Realme)
(2 / 5)
రియల్‍మీ జీటీ 7 ప్రో మొబైల్ 6.78 ఇంచుల 8టీ ఎల్‍టీపీవో ఎకో2 ఓఎల్‍ఈడీ డిస్‍ప్లేతో రానుంది. 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, ఏకంగా 6000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. డాల్బీ విజన్, 100% డీసీఐ-పీ3 గాముట, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‍ప్లేకు గార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. (Realme)
(3 / 5)
స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ చిప్‍తో రియల్‍మీ జీటీ 7 ప్రో రానుందని తెలుస్తోంది. అడెర్నో 830 జీపీయూను ఈ మొబైల్ కలిగి ఉండనుంది. గరిష్ఠంగా 24జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. వివిధ స్టోరేజ్ ఆప్షన్‍లలో ఈ మొబైల్ లభ్యమవుతుంది. ( Realme )
(4 / 5)
రియల్‍మీ జీటీ 7 ప్రో వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కెమెరా ఉంటాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ రానుంది. అధునాత ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. (Realme)
ఇతర గ్యాలరీలు