గేమర్స్ అలర్ట్- ఈ హై పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్స్ ధర రూ. 30వేల లోపే!
మీరు స్మార్ట్‌ఫోన్స్‌లో గేమ్స్ ఎక్కువ ఆడతారా? అయితే ఇది మీకోసమే! రూ. 30వేల బడ్జెట్లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
(1 / 5)
రియల్మీ జీటీ 6టీ: మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన గేమింగ్ గ్యాడ్జెట్స్‌లో ఇదొకటి. స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ వీవోసీ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. అదనంగా, రియల్మీ జీటీ 6టీని అమెజాన్‌లో డిస్కౌంట్కో కొనుగోలు చేయవచ్చు.(Realme)
(2 / 5)
పోకో ఎఫ్6: శక్తివంతమైన పనితీరు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని అందించే బ్రాండ్ తాజా ఎఫ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇది. పోకో ఎఫ్6 స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ.30,000 లోపు కొనుగోలు చేయవచ్చు.(Aishwarya Panda/ HT Tech)
(3 / 5)
వివో టీ3 అల్ట్రా: ఇది మీ గేమింగ్ సెషన్లకు అనువైన మరొక పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్మార్ట్‌ఫోన్. వివో టీ3 అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ సేపు గేమింగ్ చేసిన తర్వాత కూడా ఇది లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.(Aishwarya Panda/ HT Tech)
(4 / 5)
హానర్ 200: ఈ స్మార్ట@ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఆకట్టుకునే కెమెరాతో పాటు పనితీరును అందించే ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ ఇది. హానర్ 200 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది స్మూత్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.(Ijaj Khan/ HT Tech)
(5 / 5)
ఐక్యూ జెడ్9స్ ప్రో: ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో రూ.30,000 లోపు మరో పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4500 నిమిషాల పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. నిరంతరాయంగా గేమింగ్ సెషన్ల కోసం ఈ ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. (iQOO)
ఇతర గ్యాలరీలు