MI vs RCB Highlights: సూర్య భాయ్ ఈజ్ బ్యాక్ - 27 బాల్స్ మిగిలుండగానే ముంబై విక్టరీ
ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఆర్‌సీబీ విధించిన 196 పరుగుల టార్గెట్‌ను మరో 27 బాల్స్ మిగిలుండగానే ముంబై ఛేదించింది.
(1 / 5)
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. కోహ్లి (3 రన్స్) విఫలమవ్వగా కెప్టెన్ డుప్లెసిస్ (61 రన్స్), రజత్ పాటిదార్ (50 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో దినేష్ కార్తిక్ 23 బాల్స్‌లో 53 రన్స్‌తో మెరుపులు మెరిపించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.
(2 / 5)
ఈషాన్, సూర్యకుమార్ మెరుపులతో ఈ భారీ టార్గెట్‌ను ముంబై ఊదేసింది. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడుతోన్న సూర్యకుమార్ యాదవ్ 19 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 34 బాల్స్‌లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు
(3 / 5)
ఈ సీజన్‌లో దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆరు బాల్స్‌లో మూడు సిక్సర్లతో 21 రన్స్ చేశాడు.
(4 / 5)
ఈ మ్యాచ్‌లో ముంబై పేసర్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు
ఇతర గ్యాలరీలు