IPL RCB Record: బయట పులి.. ఇంట్లో పిల్లి.. హోం గ్రౌండ్ లో ఆర్సీబీ చెత్త రికార్డు
- IPL RCB Record: ఐపీఎల్ లో ఏ టీమ్ కైనా హోం గ్రౌండ్ అడ్వాంటేజీ ఉంటుంది. సొంత మైదానంలో టీమ్స్ రెచ్చిపోతాయి. కానీ ఆర్సీబీ కథ మాత్రం రివర్స్ గా ఉంది. హోం గ్రౌండ్ లో అత్యధిక మ్యాచ్ లు ఓడిన టీమ్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.

(1 / 5)
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకూ 5 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఇతర టీమ్స్ స్టేడియాల్లో ఆడిన 3 మ్యాచ్ ల్లో ఆర్సీబీ గెలిచింది. కానీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రెండు మ్యాచ్ లు ఓడింది. ఓవరాల్ గా ఇక్కడ 45 మ్యాచ్ ల్లో గెలవలేకపోయిన ఆర్సీబీ.. హోం గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్ లు ఓడిన టీమ్ గా చెత్త రికార్డు సొంతం చేసుకుంది.
(Surjeet Yadav)(2 / 5)
ఐపీఎల్ హిస్టరీలో హోం గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్ లు ఓడిన టీమ్స్ లిస్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ జట్టు సొంత మైదానంలో 44 మ్యాచ్ ల్లో ఓడిపోయింది
(Surjeet Yadav)(3 / 5)
మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్. కానీ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆ టీమ్ కూడా బెటర్ గా ఆడటం లేదు. ఇక్కడ ఆ టీమ్ 38 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
(REUTERS)(4 / 5)
ఐపీఎల్ లో 5 టైటిల్స్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కూడా హోం గ్రౌండ్ లో పేలవమైన ప్రదర్శనే చేస్తోంది. వాంఖడే స్టేడియంలో ఆ టీమ్ 34 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు