(1 / 5)
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆ టీమ్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
(AP)(2 / 5)
పంజాబ్ పై 10 ఓవర్లలోనే 102 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ ఛేజ్ చేసింది. ఇంకా 60 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ మ్యాచ్ లో అత్యధిక బంతుల తేడాతో విజయం సాధించిన టీమ్ గా ఆర్సీబీ నిలిచింది.
(3 / 5)
ఐపీఎల్ తో తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ చేరింది. చివరగా 2016లో ఆ టీమ్ తుదిపోరులో తలపడింది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
(4 / 5)
ఐపీఎల్ లో 4, అంతకంటే ఎక్కువ సార్లు ఫైనల్ చేరిన నాలుగో టీమ్ గా ఆర్సీబీ నిలిచింది. సీఎస్కే (10), ముంబయి (6), కేకేఆర్ (4) ముందున్నాయి.
(5 / 5)
ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరింది ఆర్సీబీనే. ఆ టీమ్ నాలుగో సారి తుదిపోరులో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఉన్నాయి.
(AFP)ఇతర గ్యాలరీలు