WPL 2025: డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ రికార్డు.. టాప్-5 అత్యధిక ఛేదనలు ఇవే.. లిస్ట్ లో ఏ జట్లు ఉన్నాయంటే?-rcb history in wpl 2025 top 5 highest run chases in league history richa ghosh ellyse perry smriti mandhana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wpl 2025: డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ రికార్డు.. టాప్-5 అత్యధిక ఛేదనలు ఇవే.. లిస్ట్ లో ఏ జట్లు ఉన్నాయంటే?

WPL 2025: డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ రికార్డు.. టాప్-5 అత్యధిక ఛేదనలు ఇవే.. లిస్ట్ లో ఏ జట్లు ఉన్నాయంటే?

Published Feb 15, 2025 01:48 PM IST Chandu Shanigarapu
Published Feb 15, 2025 01:48 PM IST

  • WPL 2025: డబ్ల్యూపీఎల్లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లోనే సెన్సేషనల్ బ్యాటింగ్ తో 202 టార్గెట్ ను అందుకుని అదరగొట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ లో టాప్-5 సక్సెస్ ఫుల్ ఛేజింగ్స్ మీకోసం. ఇందులో గుజరాత్ నాలుగు సార్లు ఓడిపోవడం గమనార్హం.

రికార్డు ఛేదనతో ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ 2025 ను ఘనంగా ఆరంభించింది. మొదట గుజరాత్ 201/5 స్కోరు చేసింది. ఛేజింగ్ లో రిచా ఘోష్ (64*), ఎలీస్ పెర్రీ (57), కనిక అహుజ (30*) మెరుపులతో ఆర్సీబీ మరో 9 బంతులు ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే విజయవంతమైన అత్యధిక ఛేదన. 

(1 / 5)

(x/RCBTweets)

2024లో ముంబయి మరోసారి అద్భుతమే చేసింది. ఛేజింగ్ లో చెలరేగి రికార్డు క్రియేట్ చేసింది. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో 191 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మొదట గుజరాత్ 190/7 స్కోరు సాధించింది. ఛేదనలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (95*) విధ్వంసంతో మరో బంతి ఉండగా ముంబయి మ్యాచ్ ముగించింది. 

(2 / 5)

(x/mipaltan)

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ కంటే ముందు ఆర్సీబీ అత్యధిక ఛేదన రికార్డు కూడా గుజరాత్ జెయింట్స్ పైనే సాధించింది. 2023లో ఆర్సీబీతో మ్యాచ్ లో గుజరాత్ మొదట 188/4 స్కోరు చేసింది. ఛేజింగ్ లో సోఫీ డివైన్ (99) సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో 15.3 ఓవర్లలోనే ఆర్సీబీ గెలిచింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని చేరుకుంది. 

(3 / 5)

డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ సూపర్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట గుజరాత్ 178/6 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గ్రేస్ హారిస్ (72), తాలియా మెక్ గ్రాత్ (57) మెరుపు ఇన్నింగ్స్ లతో యూపీ మరో బంతి మిగిలి ఉండగా టార్గెట్ రీచ్ అయింది. ఎకిల్ స్టోన్ ఫోర్ తో మ్యాచ్ ముగించింది. 

(4 / 5)

(x/UPWarriorz)

2024 డబ్ల్యూపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లోనూ ఇలాగే సంచలనం నమోదైంది. దిల్లీ క్యాపిటల్స్ సెట్ చేసిన 172 పరుగుల టార్గెట్ ను ముంబయి ఇండియన్స్ అందుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (55), యాస్తిక భాటియా (57) చెలరేగి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివరి బంతికి సజన సిక్సర్ తో ముంబయి గెలిచింది. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

(5 / 5)

Chandu Shanigarapu

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు