హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే స్పెషల్ ఫొటోలు.. ఓ లుక్కేయండి-rcb creates history as new ipl champion to lift trophy after 18 years special photos of winning celebrations goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే స్పెషల్ ఫొటోలు.. ఓ లుక్కేయండి

హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే స్పెషల్ ఫొటోలు.. ఓ లుక్కేయండి

Published Jun 04, 2025 09:28 AM IST Chandu Shanigarapu
Published Jun 04, 2025 09:28 AM IST

ఓ కల నిజమైంది. ఓ స్వప్నం సాకారమైంది. ఆర్సీబీ 18 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. కింగ్ విరాట్ కోహ్లి కెరీర్ లో ఓ పెద్ద లోటు తీరింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా ఆర్సీబీ నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఆ స్పెషల్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది. ఇది కదా ఆర్సీబీ, కోహ్లి ఫ్యాన్స్ కోరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ ఎప్పుడెప్పుడు కోహ్లికి అందుతుందా? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఈ ఫొటో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రోఫీని పక్కన పెట్టుకుని, కోహ్లి చేస్తున్న విజయ నాదం వైరల్ గా మారింది. కప్ సాధించామనే ఎమోషన్ కోహ్లీలో కనిపిస్తోంది.

(1 / 5)

(AFP)

ఈ మూమెంట్ కోసం కేవలం కోహ్లి మాత్రమే కాదు, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ ప్రపంచమంతా ఎదురు చూసింది. కోహ్లి చేతిలో ఐపీఎల్ ట్రోఫీ ఒదిగిపోగానే అందరూ ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు. ఛాంపియన్ చేతిలోకి కప్ వచ్చి చేరే సరికి తన్మయత్వంతో ఉప్పొంగిపోయారు.

(2 / 5)

(Surjeet Yadav)

కష్టాల్లో, సుఖాల్లో.. విజయాల్లో, ఓటముల్లో.. బాధల్లో, సంతోషాల్లో కోహ్లి వెంటే నడిచింది భార్య అనుష్క శర్మ. కోహ్లి లాగే ఆర్సీబీ కప్ గెలవాలనే అనుష్క ఎంతోకాలంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు అది నెరవేరడంతో కప్ తో ఇలా నవ్వులు చిందించింది విరుష్క జోడీ.

(3 / 5)

కోహ్లి, ఏబీడీ మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఆర్సీబీకి ఆడే సమయంలో కోహ్లి, డివిలియర్స్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. మైదానం బయట కూడా అదే కొనసాగుతోంది. అలాంటి ఫ్రెండ్స్.. ఆర్సీబీ కప్ గెలిచిన క్షణంలో ఇలా హత్తుకున్నారు.

(4 / 5)

దిగ్గజాలు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లేనిదే ఆర్సీబీ టీమ్ కంప్లీట్ కాదు. ఈ లెజండరీ ప్లేయర్స్ ఆర్సీబీ తరపున అద్బుతంగా రాణించారు. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. కానీ కప్ కల తీరకుండానే రిటైరైపోయారు. ఇప్పుడు ఆర్సీబీ ఫస్ట్ టైమ్ కప్ గెలిచింది. ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు గేల్, ఏబీడీ. కప్ పట్టుకుని సంబరాల్లో మునిగిపోయారు.

(5 / 5)

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు