(1 / 8)
నిర్మాణం పూర్తయ్యాక రాయనపాడు రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది.
(2 / 8)
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ. 12.13 కోట్లవ్యయంతో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధిని పనులు చేపట్టారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు.
(3 / 8)
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లను రూ. 2,611 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు, ఆధునిక సౌకర్యాలను ప్రయాణీకులకు అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.
(4 / 8)
అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను నిరంతరం పెరుగుతున్న యాత్రికుల రద్దీని తగ్గించడానికి క్రాసింగ్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు ప్రయాణీకులకు సకల సౌకర్యాల ఏర్పాటుతో స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
(5 / 8)
విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పనులు చేపట్టిన 53 రైల్వే స్టేషన్లలో ఒకటి. దీనిని రూ. 12.13 కోట్ల వ్యయంతో “అమృత్ భారత్ స్టేషన్ పథకం” కింద పునరాభివృద్ధి చేస్తున్నారు. రాయనపాడు జంక్షన్ స్టేషన్ మూడు ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది 'ఎన్. ఎస్. జి -5' కేటగిరీ రైల్వే స్టేషన్‌గా ఉంది.
(6 / 8)
విజయవాడ రైల్వే జంక్షన్‌కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌లో మొత్తం 20 రైళ్లు ఆగుతాయి. రాయనపాడు రైల్వే స్టేషన్ చెన్నై - బలహర్షా - నాగ్‌పూర్ - న్యూఢిల్లీ లైన్‌లోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉండటంతో దక్షిణ తీర ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే లైన్లలో ఒకటి. ఈ స్టేషన్‌ను విజయవాడ బైపాస్ స్టేషన్ అని కూడా పిలుస్తారు.
(7 / 8)
నాగ్‌పూర్, సికింద్రాబాద్ (వరంగల్ మీదుగా) నుండి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా వైపు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్ళకుండా రాయనపాడు గుండా వెళ్లడం వల్ల ఈ స్టేషన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ స్టేషన్ ప్రశాంతమైన పరిసరాలకు మరియు అనేక చారిత్రక మరియు మతపరమైన ప్రదేశాలకు సమీపంలో ఉండటం వల్ల ప్రసిద్ధి చెందింది.
(8 / 8)
ఆధునీకీకరణలో భాగంగా రాకపోకలను మెరుగుపరచడం, స్టేషన్ వెలుపల ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ప్రవేశాల కోసం వరండాలు ఏర్పాటు, వికలాంగులకు ప్రత్యేకమైన టాయిలెట్ల నిర్మాణం, స్టేషన్ భవనంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. ఏ. సి. వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు.
ఇతర గ్యాలరీలు