AP TG Weather Updates : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతానికి వర్ష సూచన, ఐఎండీ తాజా అప్డేట్స్-rayalaseema region is likely to receive light rain on january 31 latest imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతానికి వర్ష సూచన, ఐఎండీ తాజా అప్డేట్స్

AP TG Weather Updates : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతానికి వర్ష సూచన, ఐఎండీ తాజా అప్డేట్స్

Jan 29, 2025, 04:15 PM IST Maheshwaram Mahendra Chary
Jan 29, 2025, 04:15 PM , IST

  • AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ కు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది. ఎల్లుండి(జనవరి 31)  తేలికపాటి లేదా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు తాజా వెదర్ బులెటిన్ ను విడుదల చేసింది.

(1 / 7)

(image source istockphoto.com)

కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రమే వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది.

(2 / 7)

ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది.

(3 / 7)

దక్షిణ కోస్తాలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. కొన్నిచోట్ల మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

(4 / 7)

ఇక ఉత్తర కోస్తా, రాయలసీమలోని దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 

(5 / 7)

రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 

(6 / 7)

 హైదరాబాద్ నగరంలో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు హైదరాబాద్ తో సహా తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు