Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు
- Tirumala Ratha Saptami: సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
- Tirumala Ratha Saptami: సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
(2 / 9)
సూర్య ప్రభ వాహనంపై కొలువైన శ్రీమన్నారయణుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
(3 / 9)
తెల్లవారు జాము నుంచి రథసప్తమి కోలాహలం కనిపించింది. రథసప్తమి నాడు శ్రీవారికి పలు వాహన సేవలు కల్పిస్తారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
(4 / 9)
రథ సప్తమి వేడుకల్ని తిలకించేందకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తిరుమల మాడవీధులు కిటకిటలాడాయి.
(7 / 9)
సూర్యప్రభ వాహనంపై ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు విహరించారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
(8 / 9)
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. రథ సప్తమి వేడుకల్లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు