2024 deaths: 2024 లో మరణించిన భారతీయ ప్రముఖులు-ratan tata to zakir hussain the deaths that shocked india in 2024 photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 Deaths: 2024 లో మరణించిన భారతీయ ప్రముఖులు

2024 deaths: 2024 లో మరణించిన భారతీయ ప్రముఖులు

Dec 26, 2024, 09:51 PM IST Sudarshan V
Dec 26, 2024, 09:51 PM , IST

2024 Yearender: 2024 సంవత్సరం ముగింపునకు వస్తోంది. ఎన్నో జ్ఞాపకాలను వదిలి, మరో వారం రోజుల్లో కనుమరుగు కానుంది. ఈ సంవత్సరం ఎంతో మంది ప్రముఖులను మనకు దూరం చేసింది. వారిలో సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులున్నారు. వారి వివరాలను ఒకసారి చూడండి.

ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) 2024 సెప్టెంబర్ 12న కన్నుమూశారు. 

(1 / 7)

ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) 2024 సెప్టెంబర్ 12న కన్నుమూశారు. 

ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 1న గుండెపోటుతో కన్నుమూశారు.

(2 / 7)

ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 1న గుండెపోటుతో కన్నుమూశారు.(PTI)

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా 2024 డిసెంబర్ 20న కన్నుమూశారు. ఈయన భారతదేశపు 6వ ఉపప్రధాని చౌదరి దేవీలాల్ కుమారుడు.

(3 / 7)

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా 2024 డిసెంబర్ 20న కన్నుమూశారు. ఈయన భారతదేశపు 6వ ఉపప్రధాని చౌదరి దేవీలాల్ కుమారుడు.(HT_PRINT)

భారతీయ సంగీత విద్వాంసుడు, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ 2024 డిసెంబర్ 15న శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు.

(4 / 7)

భారతీయ సంగీత విద్వాంసుడు, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ 2024 డిసెంబర్ 15న శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు.(HT_PRINT)

ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా 2024 అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

(5 / 7)

ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా 2024 అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.(HT_PRINT)

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ 2024 డిసెంబర్ 23న కన్నుమూశారు. భారతదేశంలో సమాంతర సినిమాలకు మార్గదర్శకుడిగా పేరొందారు.

(6 / 7)

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ 2024 డిసెంబర్ 23న కన్నుమూశారు. భారతదేశంలో సమాంతర సినిమాలకు మార్గదర్శకుడిగా పేరొందారు.

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రాలోని ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ముగ్గురు ముష్కరులు కాల్చి చంపారు.

(7 / 7)

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రాలోని ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ముగ్గురు ముష్కరులు కాల్చి చంపారు.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు