(1 / 10)
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా రతన్ టాటా ముత్తాత. 1948లో అతని పదేళ్ల వయస్సులో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల అతనిని నాయనమ్మ నవాజ్ బాయ్ టాటా పెంచారు.
(2 / 10)
రతన్ టాటా అవివాహితుడు. వివిధ కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయాడు. లాస్ ఏంజెల్స్‌లో పని చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. కానీ 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం కారణంగా ఆమెను భారత్‌కు పంపడాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ప్రేమించిన వ్యక్తితో రతన్ టాటా పెళ్లి కాలేదు. తర్వాత పెళ్లి చేసుకోలేదు.
(HT_File Picture)(3 / 10)
రతన్ టాటా ఎనిమిదో తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో, ఆ తర్వాత క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. 1955లో న్యూయార్క్ నగరంలోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా పొందారు.
(4 / 10)
రతన్ టాటా 1961 లో టాటా గ్రూప్‌లో తన వృత్తిని ప్రారంభించారు. మొదటి ఉద్యోగం టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌ను నిర్వహించడం. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువు పూర్తి చేశారు. రతన్ టాటా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్వ విద్యార్థి కూడా.
(5 / 10)
టీసీఎస్‌ను రతన్ టాటా 2004లో స్థాపించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఉక్కు తయారీ సంస్థ కోరస్, బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీతో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది టాటాను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
(6 / 10)
2009లో భారతదేశంలో మధ్యతరగతి వారికోసం చౌకైన కార్లను తయారు చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రూ.లక్ష విలువైన టాటా నానోను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
(7 / 10)
ఆయనకు సేవా గుణం ఎక్కువ. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ భారతదేశంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో 28 మిలియన్ డాలర్ల టాటా స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేసింది.
(8 / 10)
2010లో టాటా గ్రూప్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి 50 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. అక్కడ తన గ్రాడ్యుయేట్ శిక్షణ పొందాడు రతన్ టాటా.
(9 / 10)
2014లో టాటా గ్రూప్ ఐఐటీ-బాంబేకు రూ.95 కోట్లు విరాళంగా ఇచ్చింది. పేద ప్రజలు, సమాజాల అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంది. ఇందుకోసం టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ (టీసీటీడీ)ను ఏర్పాటు చేసింది.
(HT_File Picture)(10 / 10)
జంషెడ్ టాటా కాలం నుంచి వర్షాకాలంలో వీధి కుక్కలను లోపలికి అనుమతించిన చరిత్ర బాంబే హౌస్‌కు ఉంది. రతన్ టాటా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన బాంబే హౌస్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల పునరుద్ధరించిన తరువాత వీధి కుక్కల కోసం ఒక కెన్నెల్ ఏర్పాటు చేశారు. ఇందులో వీధి కుక్కలకు ఆహారం, నీరు, బొమ్మలు అందిస్తున్నారు. వాటి కోసం ఒక ప్లే ఏరియా కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు