Rashmika Mandanna: మహారాణిగా రష్మిక రాజసం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.. రెండు పోస్టర్లు రివీల్
- Rashmika Mandanna: ఛావా సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రివీల్ అయింది. మహారాణి లుక్‍లో రష్మిక మెరిశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Rashmika Mandanna: ఛావా సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రివీల్ అయింది. మహారాణి లుక్‍లో రష్మిక మెరిశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో ఛావా చిత్రం వస్తోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ నేడు (జనవరి 21) రివీల్ అయింది.
(2 / 5)
ఛావా చిత్రంలో సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రను రష్మిక పోషించారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. పట్టుచీర ధరించి, ఒంటి నిండా ఆభరణాలతో రాజసం ఉట్టిపడేలా రష్మిక లుక్ ఉంది. మహారాణిగా రష్మిక అద్భుతంగా సూటయ్యారు.
(3 / 5)
మహారాణి యసుబాయ్‍గా రష్మిక మందన్నా రెండు లుక్‍లను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఓ పోస్టర్‌లో చిరునవ్వుతో ఉండగా.. మరో ఫొటోలో గంభీరంగా చూస్తున్నారు. మహారాణి లుక్‍లో రష్మిక రాజసంతో ఆకట్టుకున్నారు. పుష్ప 2 చిత్రంతో ఇటీవలే భారీ బ్లాక్‍బస్టర్ సాధించిన రష్మిక.. ఇప్పుడు మరో భారీ చిత్రంతో రానున్నారు.
(4 / 5)
మరాఠా యోధుడు, మహారాజు సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రాజుగా నటించారు విక్కీ కౌశల్. రష్మిక రాణి పాత్ర పోషించగా.. అక్షయ్ ఖన్నా, అషుతోశ్ రాణా, దివ్య దత్తా కీలకపాత్రలు చేశారు.
ఇతర గ్యాలరీలు