Uyi Amma Song: సెన్సేషన్ అవుతోన్న కేజీఎఫ్ 2 నటి కుమార్తె సాంగ్.. యూట్యూబ్‌లో RC16 హీరోయిన్ పాటకు 8.1 కోట్ల వ్యూస్!
- Rasha Thadani Uyi Amma Song Trending In Youtube: కేజీఎఫ్ 2 సినిమాలో రమికా సేన్ పాత్రలో అదరగొట్టిన నటి రవీనా టాండన్. బాలీవుడ్ మూవీ ఆజాద్‌తో తన కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆజాద్ నుంచి రిలీజ్ చేసిన ఉయ్ అమ్మ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
- Rasha Thadani Uyi Amma Song Trending In Youtube: కేజీఎఫ్ 2 సినిమాలో రమికా సేన్ పాత్రలో అదరగొట్టిన నటి రవీనా టాండన్. బాలీవుడ్ మూవీ ఆజాద్‌తో తన కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆజాద్ నుంచి రిలీజ్ చేసిన ఉయ్ అమ్మ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
(1 / 10)
ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మేద వంటి తెలుగు సినిమాల్లో అలరించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కేజీఎఫ్ 2 మూవీలో రమికా సింగ్ పాత్రలో అదరగొట్టింది. ఇప్పుడు రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చింది.
(2 / 10)
రాషా తడానీ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఆజాద్. ఇందులో హీరోగా అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ కూడా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే, జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఆజాద్ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చి ఫ్లాప్‌గా మిగిలింది.
(3 / 10)
కానీ, సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు విడుదల చేసిన ఆజాద్ మూవీలోని ఉయ్ అమ్మ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత నెల 4న యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఉయ్ అమ్మ పాటకు ఇప్పటికీ 8.1 కోట్ల వ్యూస్ అంటే సుమారుగా 81,075,302 వ్యూస్ సాధించుకుంది. అలాగే, 622 లైక్స్ సొంతం చేసుకుంది.
(4 / 10)
అంతేకాకుండా ఉయ్ అమ్మ పాట తెగ ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో సెన్సేషనల్ హిట్ అయింది. ప్రతి ఒక్కరు ఉయ్ అమ్మా సాంగ్‌పై రీల్స్ క్రియేట్ చేస్తూ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
(5 / 10)
ఉయ్ అమ్మ సాంగ్‌లో రాషా తడానీ గ్రేస్, డ్యాన్స్ మూమెంట్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. అంతేకాకుండా అసలు సిసలైన డెబ్యూ ఎంట్రీ సాంగ్ అంటూ రాషా తడానీని పొగిడేశారు.
(6 / 10)
రాషా తడానీతోపాటు అమన్ దేవగన్ పర్ఫామెన్స్‌కు కూడా ప్రశంసలు వచ్చాయి. పాటలో చాలా వరకు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇంప్రెస్ చేశాడు అమన్.
(7 / 10)
పాటలో అదరగొట్టని వీరికి ఆజాద్ మూవీ మాత్రం నిరాశపడింది. డెబ్యూ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకున్న కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయారు.
(8 / 10)
ఇదిలా ఉంటే, రాషా తడానీ (రాషా టాండన్) తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోందని టాక్ వినిపించింది. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఆర్‌సీ 16 (RC16 Movie) సినిమాలో హీరోయిన్‌గా రాషా తడానీని తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
(9 / 10)
మరి రామ్ చరణ్-బుచ్చి బాబు సానా కాంబినేషన్ ఆర్సీ16 మూవీలో రాషా తడానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది కొంత కాలం తర్వాత తెలియనుంది.
ఇతర గ్యాలరీలు