చివరి వికెట్‍కు 232 పరుగుల పార్ట్‌నర్‌షిప్.. సెంచరీలు చేసిన టేలెండర్లు.. రికార్డులు ఇవే
- Ranji Trophy - Mumbai Team: రంజీ ట్రోఫీలో అద్భుతం జరిగింది. ముంబై జట్టు తరఫున 10, 11వ స్థానాల్లో బ్యాటింగ్‍కు దిగిన ఇద్దరు టేలెండర్లు సెంచరీలు చేశారు. చివరి వికెట్‍కు 232 పరుగులు జోడించారు. ఆ వివరాలివే..
- Ranji Trophy - Mumbai Team: రంజీ ట్రోఫీలో అద్భుతం జరిగింది. ముంబై జట్టు తరఫున 10, 11వ స్థానాల్లో బ్యాటింగ్‍కు దిగిన ఇద్దరు టేలెండర్లు సెంచరీలు చేశారు. చివరి వికెట్‍కు 232 పరుగులు జోడించారు. ఆ వివరాలివే..
(1 / 5)
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో రికార్డుల మోత మోగింది. ముంబై జట్టు తరఫున 10, 11వ స్థానాల్లో బ్యాటింగ్‍కు దిగిన తుషార్ దేశ్‍పాండే (123), తనుశ్ కోటియన్ (120 నాటౌట్) సెంచరీలు బాదారు.
(PTI)(2 / 5)
రంజీ ట్రోఫీ చరిత్రలో 10, 11వ బ్యాటర్లు ఒకే మ్యాచ్‍లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అద్భుతమైన బ్యాటింగ్‍తో ముంబై టేలెండర్లు తుషార్, తనూశ్ చరిత్ర సృష్టించారు. ముంబై వేదికగా బరోడా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‍లో చివరిదైన ఐదో రోజు నేడు (ఫిబ్రవరి 27) ఆ ఇద్దరూ సెంచరీలు చేశారు.
(PTI)(3 / 5)
చివరిదైన పదో వికెట్‍కు 232 పరుగుల భాగస్వామ్యాన్ని తుషార్ దేశ్‍పాండే, తనుశ్ కోటియన్ జోడించారు. రంజీ చరిత్రలో 10వ వికెట్‍కు ఇది రెండో అతిపెద్ద పార్ట్‌నర్‌షిప్.
(PTI)(4 / 5)
తుషార్, తనూశ్ సెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 569 పరుగులు చేసింది. ముంబై, బరోడా మధ్య జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ డ్రా అయింది. అయితే, తొలి ఇన్నింగ్స్ పరుగుల ఆధారంగా ముంబై సెమీఫైనల్‍కు చేరుకుంది.
(PTI)(5 / 5)
ఈ క్వార్టర్ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే నేతృత్వంలోని ముంబై 384 పరుగులు చేయగా.. బరోడా 348 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 596 పరుగులకు ఆలౌట్ కాగా.. బరోడా 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ డ్రా కావడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అధిక రన్స్ చేసిన ముంబై సెమీస్‍కు అర్హత సాధించింది.
(PTI)ఇతర గ్యాలరీలు