Telugu Web Series: బోల్డ్ కాన్సెప్ట్‌లతో తెలుగులో రానున్న వెబ్‌సిరీస్‌లు ఇవే - ఈ మూడు స్పెషల్
వెంకటేష్, రానా, సందీప్‌కిషన్‌తో పలువురు టాలీవుడ్ స్టార్స్ రొమాంటిక్, బోల్డ్ కాన్సెప్ట్ లతో కూడిన వెబ్‌సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. త్వరలోనే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఆ వెబ్ సిరీస్‌లు ఏవంటే?
(1 / 4)
వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్ 2 ఈ వేసవిలోనే నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీజన్ వన్‌కు భిన్నంగా బోల్డ్ కంటెంట్ కాస్త తగ్గించి ఫ్యామిలీ డ్రామాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ సీజన్ 2ను తెరకెక్కించినట్లు సమాచారం.
(2 / 4)
సూపర్ సుబ్బు పేరుతో తెలుగులో సందీప్‌కిషన్ ఓ బోల్డ్ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించే ఉద్యోగంలో చేరిన ఓ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. డీజే టిల్లు ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(3 / 4)
ఈషా రెబ్బా, పూర్ణ, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ సీజన్ 2 త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మోడ్రన్ రిలేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ అంశాలతో ఈ సిరీస్ రూపొందుతోంది.
ఇతర గ్యాలరీలు