(1 / 6)
Ramya Krishnan Love Story: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన నటి రమ్యకృష్ణన్. 1990ల్లో తన గ్లామర్ షోతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. అయితే ఈ శివగామి ప్రేమ, పెళ్లిలో ఎన్నో ట్విస్టులు, టర్న్‌లు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.
(2 / 6)
Ramya Krishnan Love Story: ఈ చెన్నై బ్యూటీ మొదట తమిళ సినిమాల్లో ట్రై చేసినా అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తెలుగులో అడుగుపెట్టి పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. 1989లో సూత్రధారులు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. 34 ఏళ్లుగా ఇంకా నటిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆమెది చెక్కు చెదరని అందమే.
(3 / 6)
Ramya Krishnan Love Story: రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం కూడా కాస్త ఆసక్తకరమే. టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో వయసు దాటినా చాలా మంది హీరోయిన్లలాగే పెళ్లి చేసుకోలేదు.
(4 / 6)
Ramya Krishnan Love Story: డైరెక్టర్ కృష్ణవంశీతో చంద్రలేఖ సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోకుండానే అతనితో కలిసి సహజీవనం చేస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
(5 / 6)
Ramya Krishnan Love Story: ఆ పెళ్లి ఇష్టం లేక హైదరాబాద్ లో హడావిడిగా కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. 2003, జూన్ లో వీళ్ల పెళ్లి జరిగింది. అప్పుడు కూడా వీళ్లు ఎన్నాళ్లు కలిసుంటారులే అని ఎంతో మంది అనుకున్నారు. కానీ 20 ఏళ్లుగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది.
(6 / 6)
Ramya Krishnan Love Story: పెళ్లికి ముందు కూడా రమ్యకృష్ణ, కృష్ణవంశీ సహజీవనం చేశారు. ఆ సమయంలో తరచూ గొడవ పడటం, విడిపోవడం, మళ్లీ కలవడం చేశారు. చివరికి పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.
ఇతర గ్యాలరీలు