తెలుగు న్యూస్ / ఫోటో /
Game Changer Remunerations: గేమ్ ఛేంజర్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన చరణ్ - శంకర్ ఎంత తీసుకున్నాడంటే?
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో గేమ్ ఛేంజర్‌పైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
(1 / 5)
గేమ్ ఛేంజర్ మూవీ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాలో పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
(2 / 5)
గేమ్ ఛేంజర్ మూవీ కోసం రామ్‌చరణ్ తన రెమ్యూనరేషన్‌ను 25 నుంచి 30 కోట్ల వరకు తగ్గించినట్లు తెలిసింది.
(3 / 5)
ఆర్ఆర్ఆర్ మూవీకి 90 కోట్ల వరకు రామ్‌చరణ్ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. గేమ్ ఛేంజర్ కోసం మాత్రం 65 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.
(4 / 5)
గేమ్ ఛేంజర్ సినిమా కోసం శంకర్‌కు 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను మేకర్స్ చెల్లించినట్లు తెలిసింది.
ఇతర గ్యాలరీలు