తెలుగు న్యూస్ / ఫోటో /
Rakul Preet Singh: ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ ఛాన్స్ - రొమాంటిక్ మూవీలో హీరోయిన్‌గా!
గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇండియన్ 2 రిలీజై చాలా రోజులైనా దక్షిణాదిలో కొత్త సినిమాపై సంతకం చేయలేదు. ఎట్టకేలకు బాలీవుడ్‌లో ఓ అవకాశాన్ని దక్కించుకున్నది రకుల్.
(1 / 5)
అర్జున్ కపూర్ హీరోగా హిందీలో మేరే హజ్బెండ్ కి బీవీ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు భూమి పడ్నేకర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
(2 / 5)
ముదాస్సార్ అజీజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తోన్నాడు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ కానుంది.
(3 / 5)
మేరే హజ్బెండ్ కి బీవీతో రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
(4 / 5)
తెలుగులో రకుల్ ప్రీత్ సినిమా చేసి చాలా కాలమైంది. చివరగా 2021లో రిలీజైన కొండపొలంలో హీరోయిన్‌గా నటించింది.
ఇతర గ్యాలరీలు