తెలుగు న్యూస్ / ఫోటో /
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఐదు వేలు - ఇప్పుడు మూడు కోట్లు
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమా చేసి మూడేళ్లు దాటిపోయింది. కొండపొలం తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది రకుల్. మంచి కథ, పాత్రతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
(1 / 5)
కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్నతమిళ మూవీ ఇండియన్ 2లో రకుల్ ప్రీత్‌సింగ్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులోనూ భారతీయుడు 2 పేరుతో ఈ మూవీ డబ్ అవుతోంది.
(2 / 5)
తెలుగు తమిళ భాషల్లో ఇండియన్ 2 తనకు పూర్వ వైభవాన్నీ తీసుకొస్తోందని రకుల్ ఆశలు పెట్టుకున్నది. ఇండియన్ 2లో రకుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
(3 / 5)
ఇండియన్ 2 మూవీ కోసం రకుల్ మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీ కోసం కాజల్‌తో సమానంగా రకుల్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు.
(4 / 5)
మోడల్‌గా తాను తొలిసారి ఐదు వేల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ చెప్పింది.
ఇతర గ్యాలరీలు