TG Govt Health Card : త్వరలోనే కొత్త స్కీమ్... ప్రతి ఒక్కరికి 'హెల్త్ కార్డు' - CMRF, ఆరోగ్య శ్రీ సేవలతో లింక్!
- రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
- రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
(1 / 6)
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ స్కీమ్ ను త్వరలోనే పట్టాలెక్కించే యోచనలో ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
(2 / 6)
ఇకపై రేషన్ కార్డులకు సంబంధం లేకుండా హెల్త్ కార్డులను జారీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలాంటి లింక్ లేకుండా వేర్వేరుగా జారీ చేయాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కొత్త స్కీమ్ పై మంగళవారం అధికారులతో కలిసి సీఎం సమీక్షించారు.
(3 / 6)
హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతితో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల లెక్కలను తీయనున్నారు.
(4 / 6)
రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ విషయంపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. ఈ కార్డు ఆధారంగానే ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ సేవలు అందుతాయని చెప్పారు. ఫలితంగా ఈ రెండు సేవల్లో ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు కీలకంగా మారనుంది.
(5 / 6)
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని చాలా రోజుల కిందటే ప్రభుత్వం ప్రకటించింది. బ్లడ్ గ్రూప్ నుంచి మొదలుకొని వారికున్న ఆరోగ్య సమస్యలను సేకరించి హెల్త్ ప్రొఫైల్ కార్డును తయారు చేస్తామని పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఈ కార్డులను త్వరలోనే జారీ చేయనున్నారు.
(6 / 6)
డిజిటల్ హెల్త్ కార్డుతో వైద్యం సులభంగా అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఏదైనా ఆస్పత్రికి వెళ్తే ఈ డిజిటల్ కార్డు చూపిస్తే… గతంలో ఉన్న సమస్యలతో పాటు పూర్తి వివరాలను ఆస్పత్రి వైద్యులు తెలుసుకునేలా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఇందుకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇతర గ్యాలరీలు