తెలుగు న్యూస్ / ఫోటో /
Rajamouli Birthday: రాజమౌళి రెమ్యునరేషన్ - అప్పుడు ఐదు వేలు - ఇప్పుడు 100 కోట్లు
Rajamouli Birthday: తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది.
(1 / 5)
రాజమౌళి కెరీర్ యాడ్‌ఫిల్మ్స్‌తో మొదలైంది. రాఘవేంద్రరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజమౌళి ఓ యాడ్ ఫిల్మ్‌ను షూట్ చేసినందుకు ఐదు వేలు రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే ఆయన అందుకున్న మొదటి రెమ్యునరేషన్.
(2 / 5)
రాఘవేంద్రరావు దగ్గర చేరడానికంటే ముందు కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద ఆరు నెలల పాటు అప్రెంటిస్ ఎడిటర్‌గా రాజమౌళి పనిచేశారు. ఏవీఎమ్ రికార్డింగ్ థియేటర్‌లో కొన్నాళ్లు పనిచేశాడు రాజమౌళి.
(3 / 5)
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన శాంతినివాసం సీరియల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించారు. శాంతినివాసం సీరియల్‌కు రాజమౌళితో పాటు వరమూళ్లపూడి దర్శకుడిగా వ్యవహరించాడు.
(4 / 5)
ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా రాజమౌళి సినీ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాజమౌళి పన్నెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్టీఆర్‌తో నాలుగు, ప్రభాస్‌తో మూడు సినిమాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు