(1 / 4)
సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా అమాయకుడని, నేరం జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజ్ సోదరి మాట్లాడుతూ.. 'మా తమ్ముడు ఎక్కడికీ వెళ్లలేదు. ఆఫీసులోని వాళ్లను అడగవచ్చు. నా సోదరుడిని విడుదల చేయాలనేది నా డిమాండ్. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు.' అని చెప్పింది.
(2 / 4)
తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్ కుష్వాహా తల్లి మీడియాకు తెలిపారు. 'నా కొడుకు అలా చేయడు. వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. నా కొడుకు సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.' అని చెప్పారు. రాజ్ కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు ఆరోపించారు.
(PTI)(3 / 4)
సోనమ్‌కు సపోర్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, చివరి నిమిషంలో మేఘాలయకు వెళ్లే ప్రణాళికను రాజ్ కుష్వాహ రద్దు చేసుకున్నట్లు విచారణలో పాల్గొన్న ఇండోర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన ముగ్గురిని కూడా వెళ్లకుండా వద్దని చెప్పాడు. అయితే సోనమ్ టికెట్ కొన్న తర్వాత వారు మేఘాలయకు వెళ్లారు. చివరి క్షణంలో ముగ్గురూ చంపడానికి నిరాకరించినప్పటికీ సోనమ్ పట్టుబట్టి రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.
(ANI X)(4 / 4)
మే 23న సోనమ్, రాజా కనిపించకుండా పోయారు. జూన్ 2న మేఘాలయలో ఓ లోయలో కుళ్లిపోయిన స్థితిలో రాజా మృతదేహం లభ్యమైంది. జూన్ 9న సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. సోనమ్ తనను తాను బాధితురాలిగా పోలీసుల ముందు చూపించే ప్రయత్నం చేసింది.
ఇతర గ్యాలరీలు