తెలుగు న్యూస్ / ఫోటో /
TG Weather updates: తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాాద్‌లో వాన
- TG Weather updates: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐఎండి హెచ్చరికలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- TG Weather updates: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐఎండి హెచ్చరికలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
(2 / 6)
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్టు వెల్లడించింది. దీంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురువనున్నాయి. (image source @APSDMA)
(3 / 6)
తెలంగాణలో రెండురోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
(4 / 6)
నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఉరుములు మెరుపులతో వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
(5 / 6)
నవంబర్ 4వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని హెచ్చరించింది.
ఇతర గ్యాలరీలు