తెలుగు న్యూస్ / ఫోటో /
TS AP Weather Updates : కొనసాగుతున్న ద్రోణి ప్రభావం...! ఈ నెల 16 వరకు తెలంగాణలో వర్షాలు
- Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు కురుస్తుండటంతో భానుడి భగభగలు తగ్గాయి. మరో ఐదు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు కురుస్తుండటంతో భానుడి భగభగలు తగ్గాయి. మరో ఐదు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం దొరికినట్లు అయింది.(photo from https://unsplash.com/)
(2 / 7)
తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. (photo from https://unsplash.com/)
(3 / 7)
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో అత్యధికంగా 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 16వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.(photo from https://unsplash.com/)
(4 / 7)
ఇవాళ (శనివారం) ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి..(photo from https://unsplash.com/)
(5 / 7)
ఇక 13, 14 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.(photo from https://unsplash.com/)
(6 / 7)
ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.(photo from https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు