తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఆవర్తన ప్రభావం - ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో తేలికపాటి వానలు
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది.(image source https://unsplash.com/)
(2 / 7)
ఇవాళ నుంచి సోమవరాం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, ేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source https://unsplash.com/)
(3 / 7)
సోమవారం(జూన్ 24) తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరించింది.
(4 / 7)
జూన్ 24 తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో కురిసే అవకాశం ఉంది. జూన్ 27వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా వెదర్ బులిటెన్ లో పేర్కొంది.
(5 / 7)
ఇక ఇవాళ హైదరాబాద్ వాతావరణం చూస్తే… సాయంత్రం తేలికపాటి లేదా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.(image source https://unsplash.com/)
(6 / 7)
ఆవర్తన ప్రభావంతో ఇవాళ(జూన్ 23) ఏపీలోని మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,అలాగే అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు,కృష్ణా, గుంటూరు,పల్నాడు,ప్రకాశం, నంద్యాల,అనంతపురం, సత్యసాయి,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది(image source https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు