TG Weather Updates : కొనసాగుతున్న వాయుగుండం - తెలంగాణలోనూ 4 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు!
- Rains in AP Telangana : వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ కాగా.. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా 12కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం చెన్నైకి 360 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ, నెల్లూరుకి 450కి.మీ దూరంలో ఉంది.
(2 / 7)
ఈ వాయుగుండం గురువారం(అక్టోబర్ 17) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
(3 / 7)
ఈ ప్రభావంతో ఏపీలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. ఇక దక్షిణకోస్తాతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరిచింది. పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
(4 / 7)
రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని… ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(5 / 7)
తెలంగాణలో చూస్తే ఇవాళ(అక్టోబర్ 16) సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
రేపు(అక్టోబర్ 17) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు