(1 / 7)
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలకు ఉపశమనం దక్కినట్లు అయింది.
(photo source https://unsplash.com/)(2 / 7)
తెలంగాణ రాష్ట్రoలో రానున్న నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించింది.వకాశం-వాతావరణ శాఖ
(photo source https://unsplash.com/)(3 / 7)
ఈరోజు(మే9) అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఇక ఉత్తర, ఉత్తర ఈశాన్యా జిల్లాలకు ముఖ్యంగా వర్ష ప్రభావం ఉంది.
(photo source https://unsplash.com/)(4 / 7)
మరో నాలుగైదు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మే 13వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
(photo source https://unsplash.com/)(5 / 7)
మే 13వ తేదీన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
(6 / 7)
మే 15వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది.
(photo source https://unsplash.com/)(7 / 7)
మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(photo source https://unsplash.com/)ఇతర గ్యాలరీలు