(1 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
(@APSDMA Twitter)(2 / 6)
రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
(Photo Source Unshplash.com)(3 / 6)
ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఏపీలో మే 26వ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది.
(Photo Source Unshplash.com)(4 / 6)
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
(@APSDMA Twitter)(5 / 6)
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ వానలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
(@APSDMA Twitter)(6 / 6)
ఇక తెలంగాణలో మే 25తో పాటు 26వ తేదీ ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(@APSDMA Twitter)ఇతర గ్యాలరీలు