AP Weather Updates : మండే వేసవిలో ఏపీకి కూల్ న్యూస్ - ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన..!
- AP Weather Updates : మండుతున్న ఎండల వేళ ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో… మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Weather Updates : మండుతున్న ఎండల వేళ ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో… మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 7)
ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
(image source unsplash.com)(2 / 7)
ఎండలు మండుతున్న వేళ ఏపీకి వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.
(image source unsplash.com)(3 / 7)
ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈ ద్రోణి బలహీనపడిందని వివరించింది.
(Unsplash)(4 / 7)
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణమే ఉండనుంది. ఎల్లుండి మాత్రం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
(5 / 7)
దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణమే ఉండనుంది. ఎల్లుండి మాత్రం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 - 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం లేదని వివరించింది.
(6 / 7)
రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు పొడి వాతవరణం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.
(7 / 7)
ఎల్లుండి మాత్రం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 - 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం పేర్కొంది. వర్ష సూచనలో ఏపీలో ఉష్ణోగ్రతల నమోదులో మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు