AP TG Weather News : బలపడనున్న 'అల్పపీడనం' - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- AP Telangana Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 7)
ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో… శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది.
(2 / 7)
ఇది మరింతగా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంకు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
(3 / 7)
ఏపీలో ఇవాళ(డిసెంబర్ 08.2024) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
తెలంగాణలో చూస్తే ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(5 / 7)
వర్ష సూచన ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు లేవని వాతావరణశాఖ తెలిపింది. అయితే అన్న దాతలు మాత్రం అలర్ట్ గా ఉండాలని సూచించింది. పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
(6 / 7)
ఇక తెలంగాణలో చూస్తే డిసెంబర్ 10వ తేదీ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు