Rahul Gandhi in Hyderabad : అశోక్ నగర్ అడ్డాలో రాహుల్ గాంధీ - నిరుద్యోగుల బాధలు వింటూ ఎమోషనల్!-rahul gandhi interaction with job aspirants at ashok nagar in hyderabad ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Rahul Gandhi Interaction With Job Aspirants At Ashok Nagar In Hyderabad

Rahul Gandhi in Hyderabad : అశోక్ నగర్ అడ్డాలో రాహుల్ గాంధీ - నిరుద్యోగుల బాధలు వింటూ ఎమోషనల్!

Nov 26, 2023, 07:03 AM IST Maheshwaram Mahendra Chary
Nov 26, 2023, 07:03 AM , IST

  • Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న నిరుద్యోగ యువతను కలిశారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేస్తామని హామీనిచ్చారు రాహుల్ గాంధీ.

అశోక్ నగర్ లోని నిరుద్యోగ యువతతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

(1 / 6)

 ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “ఈరోజు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను నేను కలిశాను.తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది” అని చెప్పారు.

(2 / 6)

“కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండరును వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను” అని తెలిపారు రాహుల్ గాంధీ. 

(3 / 6)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

(4 / 6)

ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఫేమస్ రెస్టారెంట్ బావర్చి కూడా వెళ్లారు రాహుల్ గాంధీ. అక్కడ ఉన్న చాలా మంది రాహుల్ గాంధీని కలిసేందుకు ఆసక్తి చూపారు. పలువురు రాహుల్ గాంధీతో ఫొటోలు దిగారు.

(5 / 6)

బావర్చి సిబ్బందితో మాట్లాడిన రాహుల్ గాంధీ… అక్కడి మెను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు