తెలుగు న్యూస్ / ఫోటో /
Raha Birthday: హ్యాపీ బర్త్‌డే రాహా.. రణ్‍బీర్, ఆలియా ముద్దుల కుమార్తె క్యూట్ ఫొటోలు చూసేయండి
Raha Birthday: సినీ స్టార్స్ రణ్‍బీర్ కపూర్, అలియా భట్ దంపతుల కుమార్తె నేడు (నవంబర్ 6) రెండో యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి క్యూట్ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 9)
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ దంపతుల కుమార్తె రాహా నేడు (నవంబర్ 6) రెండో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రెండో సంవత్సరంలోకి ఈ చిన్నారి అడుగుపెట్టారు.
(2 / 9)
రాహా ఫొటోలను ఏడాది కాలంగా క్రమంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రణ్‍బీర్, అలియా. ఇటీవల దీపావళి సందర్బంగా వారి కొత్త ఇంట్లో చేసిన పూజలో చిన్నారి రాహా కూడా కనిపించారు. ఆ ఫొటోలే ఇవి.
(3 / 9)
2022 నవంబర్ 6వ తేదీన రాహాకు అలియా జన్మనిచ్చారు. దీంతో అలియా, రణ్‍బీర్ తొలిసారి తల్లిదండ్రులయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మార్చెంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకకు రాహాను కూడా వారు తీసుకెళ్లారు.
(4 / 9)
రాహాను ఎత్తుకొని అలియా చాలాసార్లు కనిపించారు. ఓ సందర్భంలో ఎయిర్‌పోర్టులో క్లిక్ అనిపించిన ఫొటో ఇది. కెమెరాలవైపు క్యూట్‍గా చూశారు రాహా.
(5 / 9)
కలీనా ఎయిర్‌పోర్టులో రాహాను రణ్‍బీర్ ఎత్తుకున్న ఫొటో ఇది. స్మైల్‍తో రాహా మరింత క్యూట్‍గా కనిపించారు.
(6 / 9)
రాహాను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓసారి బయటికి తీసుకొచ్చారు. అయితే, కెమెరాల వల్ల రాహా ఇబ్బందిపడుతున్నట్టు చిరాకుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
ఇతర గ్యాలరీలు