(1 / 5)
IPL 2025 Punjab Kings: పంజాబ్ కింగ్స్ ఈసారైనా తమ రాత మారాలంటూ ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే పూజలు చేస్తోంది. 17 సీజన్లుగా ఉత్త చేతులతోనే ఇంటిదారి పడుతున్న ఆ టీమ్.. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పూజలు చేసింది. దీనికి ఆ టీమ్ కోచ్ రికీ పాంటింగ్, ఇతర కోచింగ్ సిబ్బంది, ప్లేయర్స్ హాజరు కావడం విశేషం.
(2 / 5)
IPL 2025 Punjab Kings: పంజాబ్ కింగ్స్ జట్టు 2008 నుంచి ఐపీఎల్లో ఆడుతోంది. ఈ ఫ్రాంచైజీని మొదట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ గా మార్చారు. అయినా వాళ్ల రాత మాత్రం మారలేదు. ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. దీంతో ఈసారి కొత్త కోచ్ రికీ పాంటింగ్, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయినా ట్రోఫీ అందిస్తారన్న ఆశతో ఆ టీమ్ ఉంది.
(3 / 5)
IPL 2025 Punjab Kings: గతేడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కాళీఘాట్ కు వెళ్లి పూజలు చేసింది. ఇప్పుడు కూడా సీజన్ ప్రారంభానికి ముందు వికెట్ ను పూజించడం ద్వారా సన్నాహక శిబిరాన్ని ప్రారంభించారు. గతేడాది పూజలు చేసి చివరికి ట్రోఫీ అందుకున్నారు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా కేకేఆర్ రూట్లోనే వెళ్తోంది.
(4 / 5)
IPL 2025 Punjab Kings: పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ ఒకేసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. అది కూడా 2014లో. అప్పుడు కేకేఆర్ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత ఆ టీమ్ పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి రికీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ లపై ఆ టీమ్ భారీ ఆశలే పెట్టుకుంది.
(HT_PRINT)(5 / 5)
IPL 2025 Punjab Kings: సుదీర్ఘ కాలం ఐపీఎల్లో పనిచేసిన ఆస్ట్రేలియా స్టార్ రికీ పాంటింగ్ ను కోచ్ గా తీసుకున్నారు. ఈ ఏడాది కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్స్‌వెల్, చాహల్, అర్షదీప్ కూడా జట్టులో ఉన్నారు. పంజాబ్ కు చెందిన విదేశీ ఆటగాళ్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లే. మరి ఈ ఇద్దరితోపాటు వాళ్లు చేస్తున్న ప్రత్యేక పూజలు పంజాబ్ కింగ్స్ రాత మారుస్తాయేమో చూడాలి.
(PTI)ఇతర గ్యాలరీలు